అన్నింట్లోనూ సీమకు అన్యాయమే

Published on Thu, 12/01/2016 - 18:34

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: రాయలసీమకు ప్రతి విషయంలోనూ అన్యాయమే జరిగిందని రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులు రవిశంకర్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాయలసీమలో సహ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు కుట్రలు,కుతంత్రాల వల్ల  ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎందరో మహానుభావులు పుట్టినిల్లకు నిలయంగా మారిన ఈ ప్రాంతం తాగు,సాగు నీటి ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పూర్తి చేయడం లేదన్నారు..శ్రీశైలం నీటిని విద్యుత్‌ పేరుతో 854 కనీస అడుగుల నీటి మట్టాన్ని నిల్వ చేయకుండా ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు రాయలసీమకు కాకుండా నీటిని తీసుకెళ్లడం దారుణమన్నారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న చంద్రబాబు ఇంతవరకు నీరు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. శ్రీ బాగ్‌ ఒడంబడిక నుంచి నేటి విభజన చట్టంలో కూడా రాయలసీమకు అన్యాయం జరగడం బాధాకరమన్నారు.సీమలోని సమస్యలు పరిష్కరించేందుకే రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. త్వరలో రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ తరపున కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, లింగమూర్తి, బీసీ సంఘ నాయకులు అవ్వారు మల్లికార్జున, జేవీ రమణ.సంఘ సేవకులు సలావుద్దీన్‌ ,మగ్బూల్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ