amp pages | Sakshi

చిత్రాల పువ్వమ్మ చిరకాలం బతుకమ్మ

Published on Sat, 10/01/2016 - 21:29

బ్రసెల్స్, ఇంగ్లాండ్‌... ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే పూల పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాలకు కేవలం ఆ ఫ్లవర్‌ ఫెస్టివల్స్‌ కారణంగానే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే వీటన్నింటినీ మించింది మన బతుకమ్మ. ప్రకృతి సౌందర్యానికి పట్టం గట్టే అద్భుతమైన ఈ వేడుక విశిష్టతను విశ్వవ్యాప్తం చేసే కృషిలో భాగంగా తెలంగాణ చిత్రకారుల సంఘం రవీంద్రభారతిలో బతుకమ్మ చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది.
                                                           – ఎస్‌.సత్యబాబు

ప్రకృతిలోని ప్రతి ఆకు, పువ్వు అందమైనదేనని నిరూపిస్తూ.. మనసులను పూల వనంలా మార్చేంత చక్కని సంప్రదాయం బతుకమ్మ పండుగ. ఈ సంబరాల్లో సున్నితత్వం ఉంది. సృజనాత్మకత ఉంది. అందం ఉంది. అంతకు మించిన ఆధ్యాత్మికత ఉంది. ఒక చిత్రకారుడి మనసు స్పందించడానికి అంతకన్నా కావాల్సిన ముడిసరుకు ఏముంది? అదే విషయాన్ని ఇలా పంచుకున్నారీ చిత్రకారులు...

పాటకు పట్టం కట్టా...
అమ్మమ్మ, నానమ్మ, అమ్మ బతుకమ్మలు చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. పండుగ సెలవుల్లో ముత్యాల పూలు అవీ ఇవీ తెచ్చి కలర్స్‌ వేస్తూ బతుకమ్మ తయారీలో నిమగ్నమయ్యే దానిని. బతుకమ్మ పేర్చడం ఇప్పటి వారికి చాలా మందికి తెలీదు. అందుకని ఆ పేర్చడం అనేదాన్ని వివరిస్తూ కూడా ఓ చిత్రం గీశాను. అలాగే ‘ఓరుగల్లు చూసి ఉయ్యాలో..’ పాటకు తగ్గట్టుగా నా పెయింటింగ్‌లో తెలంగాణలోని అన్ని ముఖ్యమైన ప్లేసెస్‌ వచ్చేలా చిత్రం గీశాను.           

    

   – సరస్వతి, చిత్రకారిణి

ఢిల్లీలో ఉన్నా మరువలేకున్నా...
గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాం. మా స్వస్థలం చిట్యాల. మా ఊరిలో శివుడి గుడి ఉండేది. అక్కడే బతుకమ్మ ఆడేవాళ్లం. అప్పటి జ్ఞాపకాలు, ఆ సంతోషం మరిచిపోలేం. అవే స్ఫూర్తిగా బతుకమ్మ చిత్రాలు గీస్తున్నాను. గత కొంతకాలంగా దేశ రాజధానిలో సైతం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చాక గతేడాది ఢిల్లీలో 25 మంది మహిళలతో కలిసి బతుకమ్మ సెలబ్రేట్‌ చేశాం. తెలంగాణ భవన్‌లో కూడా తరచూ జరిగే సంబరాల్లో పాల్గొంటున్నాను.
                                              

   – అర్పితారెడ్డి. ఢిల్లీ చిత్రకారిణి

 కుంచెను కదిలిస్తుంది...
ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాల్సిన పండుగ ఇది. తెలంగాణ ఆర్టిస్ట్, హైదరాబాద్‌ ఆర్టిస్ట్‌ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నాం. ‘ఫ్లవర్‌–ఫిమైన్‌ అండ్‌ బతుకమ్మ’ అనే థీమ్‌ ఎంచుకున్నాం. ప్రతి చిత్రకారుడికీ మహిళ, పుష్పం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్‌. అసలు ఫైనార్ట్స్‌లో మదర్‌ అండ్‌ చైల్డ్‌తోనే పాఠం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో 40 మంది చిత్రకారులు బతుకమ్మ స్ఫూర్తిని ఎవరికి వారే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రాలను మేం ప్రదర్శిస్తున్నాం.
                                – ఎం.వి.రమణారెడ్డి, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ

 

Videos

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)