amp pages | Sakshi

వాహన కొనుగోళ్లు ఢమాల్‌

Published on Sat, 12/31/2016 - 23:02

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌ ...
- ద్విచక్రవాహనాలపై ఎక్కువ ప్రభావం
- మిగతా వాహనాలకూ తగ్గిన డిమాండ్‌

అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్‌ సమీపంలో ఉన్న ద్విచక్రవాహన షోరూంలో రెండు నెలల వ్యవధిలో దాదాపు 50 శాతం వ్యాపారం పడిపోయింది. 2015 నవంబర్‌లో 845 వాహనాలు, డిసెంబర్‌లో 638 వాహనాలను విక్రయించిన నిర్వాహకులు 2016 నవంబర్‌లో 509, డిసెంబర్‌లో 260 వాహనాలు మాత్రమే విక్రయించామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని షోరూంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. - అనంతపురం సెంట్రల్‌

పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ప్రజల వద్ద నగదు లావాదేవీలు పూర్తిగా మందగించాయి. బ్యాంకులు ఇచ్చే డబ్బులు కనీస అవసరాలకే సరిపోవడం లేదు. దీంతో ప్రజలు సౌకర్యాలపై వెచ్చించే ఖర్చులను పూర్తిగా తగ్గించేశారని తెలుస్తోంది. మనిషి జీవితంలో వాహనం ఒక భాగమైంది. ప్రతి పనికీ వాహనం వినియోగించే పరిస్థితి వచ్చింది. ఆర్థిక స్థోమతను బట్టి ద్విచక్రవాహనం, కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరుకు రవాణాకు ఉపయోగించే వాహనాలు కూడా పెరిగాయి. ప్రతి ఏడాదీ వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2008లో 1,49,670 ఉన్న ద్విచక్రవాహనాలు నేటికి 2.22,603 చేరుకున్నాయి. ఆటోలు, కార్లు, లారీలు ఇలా అన్ని వాహనాలూ 2008కి నేటికీ రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ప్రతి నెలా వందల్లో, ప్రతి ఏడాదీ వేలల్లో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

మందగించిన కొనుగోళ్లు
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత వాహన కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. ఎక్కువ శాతం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వాహనాలపై ప్రభావం చూపింది. మరికొన్ని నెలల పాటు ఈ ప్రభావం ఇలాగే ఉంటుందని వాహన షోరూం నిర్వాహకులు పేర్కొంటున్నారు.

నెలవారీగా ప్రధానమైన  వాహన కొనుగోళ్లలో వ్యత్యాసం ఇలా...
వాహనాల రకం     2015  అక్టోబర్‌    2015 అక్టోబర్‌    2015 నవంబర్‌    2016 అక్టోబర్‌ 2016 నవంబర్‌ 2016 డిసెంబర్‌     
మోటారు కారు    156    0    221    204    207    97    
ఆటో రిక్షాలు    232    219    286    238    280    135    
గూడ్స్‌ వాహనాలు    163    124    145    138    210    57    
ద్విచక్రవాహనాలు     2712    3867    3768    2795    3652    1158    

ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది
వాహనాల కొనుగోళ్లు  గతంతో పోలిస్తే తగ్గాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఎక్కువ ప్రభావం చూపింది. దీనివలన రిజిస్ట్రేషన్, ఇతర పన్నులు రాక ప్రభుత్వానికి ఆదాయం కూడా కొంతమేర తగ్గింది.
- శ్రీధర్, ఆర్టీఓ, అనంతపురం

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్