కలెక్టర్‌ చెంతకు కుప్పం ‘పంచాయితీ’

Published on Sat, 07/30/2016 - 22:56

– 16 మంది వార్డు మెంబర్లు రాజీనామాల సమర్పణ
– ఆగస్టు 4న స్వయంగా విచారణ చేపడతామని హామీ  

చిత్తూరు : సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పంచాయతీలో రాజీనామా బాటపట్టిన వార్డు మెంబర్లతో శనివారం కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ రహస్య మంతనాలు జరిపినట్లు తెలిసింది. కుప్పం మేజర్‌  పంచాయతీ. మొత్తం 20 మంది వార్డు మెంబర్లతో పాలకవర్గం ఉంది. మూడేళ్లుగా పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇందుకు సర్పంచ్‌ తీరే కారణమని శుక్రవారం టీడీపీకి చెందిన 16 మంది వార్డు మెంబర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లడం, అక్కడ అధికారులు లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చిన విషయం విదితమే.

అయితే వారు శనివారం కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌కు  రాజీనామా పత్రాలను సమర్పించారు. దీంతో కలెక్టర్‌ తన కార్యాలయంలో దాదాపు గంటన్నర సమయం ఇతరులను ఎవరినీ లోనికి రానీయకుండా వారితో చర్చలు జరిపారు. ఉన్నఫళంగా రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ వారికి సూచించినట్లు సమాచారం. సర్పంచ్‌ తీరు సరిగాలేదని, అవినీతికి పాల్పడుతన్నారని వారు ఆరోపించినట్లు తెలిసింది. మూడేళ్లుగా కుప్పం పంచాయతీ అభివృద్దికి విడుదలైన నిధులకు ఎలాంటి లెక్కలు లేవని తెలిపారు.

డంపింగ్‌ యార్డు శుభ్రం కోసం విడుదలైన రూ. 25 లక్షలు, ఎస్‌డీఎఫ్‌ కింద సీసీ రోడ్లకు విడుదలైన రూ. 4.50 కోట్లకు మూడు వీధులకు మాత్రమే సీసీ రోడ్లు ఏర్పాటుచేసి ఖర్చులు చూపెట్టలేదన్నారు. మొత్తం 20 అంశాలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని వారు కలెక్టర్‌కు అందజేశారు. సర్పంచ్‌ తీరుతో విసుగుచెంది రాజీనామాకు సిద్ధమయ్యామని వారు కలెక్టర్‌కు వివరించినట్లు తెలిసింది. దీనిపై తానే స్వయంగా ఆగస్టు నాలుగో తేదీ కుప్పం విచ్చేసి విచారణ జరిపిస్తానని  కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు వార్డు సభ్యులు తెలిపారు. తమ రాజీనామా పత్రాలు కూడా అంతవరకు పెండింగ్‌లో ఉంచి, విచారణలో తమకు న్యాయం జరగకపోతే రాజీనామాలను ఆమోదింప జేయాలని కలెక్టర్‌ను కోరినట్లు వారు చెప్పారు. అంతకుమునుపు వారు డీపీవో ప్రభాకర్‌రావుకు కూడా రాజీనామా పత్రాలు అందజేశారు. పంచాయతీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఫిర్యాదు చేశారు.

కడా ఎస్వో, ఎంపీడీవోకు కూడా రాజీనామాలు
కుప్పం : కుప్పం పంచాయతీ వార్డు సభ్యులు 16 వుంది శనివారం కడా ఎస్వో శావ్యుప్రసాద్‌కు, మండల అభివృద్ధి అధికారి రామచంద్రకు రాజీనామా పత్రాలను అందజేశారు. ముుఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక్కసారిగా 16 మంది వార్డు మెంబర్లు రాజీనామా చేయడం సంచలనం రేపింది.

Videos

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)