ఆక్రమణల తొలగింపునకు మళ్లీ రంగం సిద్ధం

Published on Mon, 11/07/2016 - 01:04

  • నేటి నుంచి ఆక్రమణల తొలగింపు
  • కసరత్తు ప్రారంభించిన మున్సిపల్‌ అధికారులు
  • భారీగా పోలీసులు మొహరించే అవకాశం
  •  
    నెల్లూరు, సిటీ: నగరంలోని పంట కాలువలపై ఆక్రమణలు తొలగించేందుకు నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ రంగం సిద్ధం చేశారు. నగరంలోని రామిరెడ్డి కాలువ, గచ్చుకాలువ, సాహెబ్‌ కాలువలపై నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు.ఇప్పటికే కాలువలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, దుకాణాలకు నోటీసులు జారీ చేసి ఉన్నారు. గత నెల 8న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అయితే ఒక్క రోజు మాత్రం భారీ భవనాలను పాక్షికంగా తొలగించి, పేద ఇళ్లు కూల్చివేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉమామహేశ్వర ఆలయం సమీపంలో నివసించే పేదల ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ అడ్డుకున్నారు. పునరావాసం చూపకపోవడంపై కోర్టును ఆశ్రయించగా ఆక్రమణల తొలగింపును నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేసిన మున్సిపల్‌ అధికారులు మళ్లీ తొలగింపునకు కసరత్తు ప్రారంభించారు. 
    భారీ పోలీసు బందోబస్తు
    ఆక్రమణల తొలగింపునకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మున్సిపల్‌ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం  ఆక్రమణలు తొలగించే ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఉమామహేశ్వరి ఆలయం వద్దే ఆక్రమణలు తొలగింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఏ ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు చేపడుతారనేది గోప్యంగా ఉంచుతున్నారు.
     
     

Videos

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)