amp pages | Sakshi

చెత్త విద్యుత్‌కు షాక్‌

Published on Tue, 05/09/2017 - 01:24

‘చెత్త విద్యుత్‌’ ప్రాజెక్టుకు బాలారిష్టాలు
ప్లాంట్‌కు అనుమతుల నిరాకరణ
ఎస్టీ కాలనీ ఉండటమే కారణం
మరో స్థలం కోసం అన్వేషణ


రూ.200 కోట్ల భారీ ప్రాజెక్టుకు నేష నల్‌ పొల్యూషన్‌ బోర్టు మొకాలడ్డు వేసింది. వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ (చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే ప్రాజెక్టు) ను తిరుపతి కార్పొరేషన్‌ ప్రతిష్టాత్మకం గా చేపట్టింది. చంద్రగిరి మండలం శానంబట్ల సమీపంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలని భావించింది.స్థల సేకరణ పూర్తయింది. పనుల ప్రారంభం కోసం రంగం సిద్ధం చేసుకునే సమయంలో బ్రేక్‌ పడింది. ప్లాంట్‌ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైంది కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని నేషనల్‌ పొల్యూషన్‌ బోర్టు అనుమతులను నిరాకరించింది.

తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో రోజు కు 192 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. దీని సేకరణే ఓ సవాల్‌గా మారింది. ఇక సేకరించిన చెత్త గుట్టలు గుట్ట లుగా పేరుకుపోతోంది. కొతంకాలం వరకు తగులబెట్ట డం, మరి కొన్నాళ్లు పూడ్చేయడం వంటివి చేశారు. తద్వారా నీరు, భూమి, గాలి కాలుష్యం అవుతుండటంతో ఈ విధానానికి చెక్‌ పెట్టారు. తడి, పొడి చెత్తను వేరుచేసి కొంతవరకు వినియోగంలోకి తీసుకొచ్చారు. అయినా సగం నిల్వ ఉండటంతో పూర్తిస్థాయిలో చెత్తను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావించారు. ఢిల్లీ ప్రభుత్వం వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. 90 శాతం చెత్తను కనుమరుగు చేయడంతోపాటు తద్వారా తక్కువ ధరకే విద్యుత్‌ అందిస్తోంది. ఇదే తరహాలో చెత్తనుంచి విద్యుత్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌ అధికారులు భావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. గ్రీన్‌ సిగ్నెల్‌ రావడంతో 2016 ఏప్రిల్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.

అనుమతులు నిరాకరణ..
వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఢిల్లీకి చెందిన జిందాల్‌ కంపెనీ దక్కించుకుంది. ఆ కంపెనీ ప్రభుత్వంతో అన్ని ఒప్పందాలు పూర్తి చేసుకుంది. ఎయిర్‌పోర్టు, నేషనల్‌ పొల్యూషన్‌ బోర్డు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. మార్చిలో ప్లాంట్‌ పనులు ప్రారంభించేలా ముహూర్తం ఖరారు చేసుకుంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి సకాలంలో అనుమతులు అందాయి. పొల్యూషన్‌ బోర్డు ప్రతినిధుల బృందం చంద్రగిరి మండలం శానంబట్ల సమీపంలోని 16.22 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ స్థలానికి కూతవేటు దూరంలో తాటికోన ఎస్టీ కాలనీ ఉండటంతో ప్లాంట్‌ ఏర్పాటును పొల్యూషన్‌ బోర్టు సభ్యులు వ్యతిరేకించారు. తమ చట్టం ప్రకారం ఈ ప్లాంట్‌ ఏర్పాటు చట్ట విరుద్ధమని,, నిబంధనలు ఒప్పుకోవని తేల్చేశారు. దీంతో మరో స్థలాన్ని వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ముచ్చటగా మూడోసారి..
వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు స్థల సేకరణపై కార్పొరేషన్‌ దృష్టి సారించింది. ఇప్పటికే డంపింగ్‌ యార్డుగా వినియోగిస్తున్న రామాపురంలో తొలుత ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ ప్రదేశం అనువైంది కాదని జిందాల్‌ తిరస్కరించింది. చంద్రగిరి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. అప్పటి కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ శానంబట్ల సమీపంలోని సర్వే నంబర్‌ 1505, 1507లలో 16.22 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలం ప్లాంట్‌కు అనువుగా ఉండటంతో కంపెనీ వేగంగా అడుగులు వేసింది. ఇంతలో పొల్యూషన్‌ బోర్డు అభ్యంతరం చెప్పడంతో మరోసారి స్థలం వెతుకులాటలో కార్పొరేషన్‌ తనమునకలైంది. ముచ్చటగా మూడోసారి చంద్రగిరి మండలంలోని సీ.మామండూరు సమీపంలో ప్రభుత్వ భూమిని గుర్తించారు. తమకు ఇక్కడ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు.

ఇదీ లక్ష్యం..
చెత్తను పూర్తి స్థాయిలో వినియోగించి, తద్వారా కార్పొరేషన్‌కు లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు చేశారు. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో చెత్తను సేకరించడం, దాచడం, వినియోగించడం కార్పొరేషన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు కొన్ని వందల మెట్రిక్‌ టన్నుల చెత్త నిల్వ ఉంటోంది. ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ చెత్త సరిపోకపోవడంతో చిత్తూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, వెంకటగిరి ప్రాంతాల నుంచి సేకరించేలా ఒప్పందం కుదిరింది. మొత్తంగా రోజుకు 374 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరించి, తద్వారా రోజుకు 6 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)