వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి

Published on Fri, 10/07/2016 - 22:31

అర్వపల్లి : పాలకుల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మలో భాగంగా శుక్రవారం రాత్రి తిమ్మాపురంలో మన భూములు మనవే–మన వనరులు మనవే అనే నినాదంతో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన వనరులను బహుళజాతి కంపెనీలకు పాలకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వనరులను కాపాడుకోవడానికి అంతా కలిసి పోరాడాలన్నారు. బతుకమ్మ పండుగతో బహుజనులు ఏకం కావాలన్నారు. ఆడపిల్లలను ఎదగనివ్వాలని, మద్యాన్ని తరిమికొట్టాలని కోరారు. ఈసందర్భంగా ఆమె బతుకమ్మ పేర్చి ఆతర్వాత ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు జరిపారు. అనంతరం గ్రామ చావడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌ బైరాగి, తెలంగాణ రైతుకూలి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణదాసు, రాష్ట్ర నాయకులు మల్సూరు, బొమ్మకంటి కొమురయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆవుల నాగరాజు, తీగల పూలన్, పటేల్‌ మధుసూధన్‌రెడ్డి, సైదులు, మిడసనమెట్ల వెంకన్న, బైరబోయిన జానయ్య, బండి యాదయ్య, అంబటి సైదులు, రవి, కిరణ్‌ పాల్గొన్నారు. 
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ