ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published on Tue, 10/04/2016 - 02:16

జంగారెడ్డిగూడెం : ఆర్టీసీ బస్సులో  గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. బస్సు డ్రైవర్, కండక్టర్‌ కథనం ప్రకారం..  తెలంగాణ రాష్ట్రం భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం రాజమండ్రి నుంచి భద్రాచలం వెళుతోంది. ఈ బస్సులో  రాజమండ్రిలో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు.  వారు జంగారెడ్డిగూడెం వరకూ టికెట్‌ తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి సెంటర్‌కు చేరుకునే సరికి వారిలో ఒకరు దిగిపోయారు.  ఆ తర్వాత అతనితోపాటు ఎక్కిన వ్యక్తి మృతిచెందినట్టు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు గుర్తించారు. దీంతో వారు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేçÙన్‌కు బస్సును తీసుకువెళ్లారు. పోలీసులు అక్కడి నుంచి వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి బస్సును తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. బస్సును ఆసుపత్రి వద్దే ఉంచి మృతిచెందిన వ్యక్తి ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.  మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. బస్సు నుంచి దిగిపోయిన వ్యక్తికి సంబంధించిన బ్యాగులు బస్సులోనే ఉన్నట్టు గుర్తించారు. ఈ బ్యాగుల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ పనికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆ ఇద్దరు గోపాలపురం మండలం పెద్దాపురానికి చెందిన వారిగా తెలుస్తోంది.  మృతుడి పేరు రాజుగా భావిస్తున్నారు. ఇతనితోపాటు ఉన్న వ్యక్తి బస్సు దిగి వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ