amp pages | Sakshi

పక్కాగా పర్యవేక్షణ

Published on Sat, 07/30/2016 - 23:39

  • పాఠశాలల పనితీరుపై సాంకేతిక నిఘా
  • క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ ట్యాబ్‌లలో నిక్షిప్తం
  • అవినీతి రహిత చర్యల నిరోధానికి విద్యాశాఖ అడుగులు
  •  
    బాలాజీచెరువు (కాకినాడ) :
    ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని గుర్తించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షించి పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్‌లో పొందుపరచి వాటిని జిల్లా అధికారులలు పరిశీలించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారులకు ట్యాబులు పంపిణీ చేసి వారి నుంచి అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలు, సమస్యలుస వివరాలను తెలుసుకుంటున్నారు. లోపాలున్న చోట జిల్లా అధికారులు స్పందించేలా చర్యలు చేపట్టారు.పాఠశాల పనితీరు పర్యవేక్షణకు ఈ విధానం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
    విద్యాంజలి యాప్‌..
    విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఇంటర్‌నెట్‌లో నిక్షిప్తం చేసేందుకు జిల్లా విద్యాశాఖ, ఏస్‌ఏస్‌ఏ సంయుక్తంగా విద్యాంజలి యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏ సమయానికి హాజరౌతున్నారు, మ«ధ్యాహ్న భోజనం అమలు, విద్యార్థుల సామర్థ్యాలు ఇందులో పొందుపరుస్తారు. జిల్లా అధికారులు ఎక్కడి నుంచైనా వాటిని సమీక్షించే అవకాశం ఉంది. ట్యాబుల్లో స్కైప్‌ను డౌన్‌లోడ్‌ చేసి వీడియోకాల్‌ ద్వారా హెచ్‌ఎంలతో మాట్లాడేలా చర్యలు చేపట్టారు. తద్వారా విద్యాశాఖ తీరును గాడిలో పెట్టి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని అధికారులు అడుగులు వేస్తున్నారు.
    ఉన్నతాధికారుల పర్యవేక్షణలో..
    జిల్లాలో సర్వ శిక్షాభియాన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల హెచ్‌ఎంలు, కేజీబీ వీల ప్రత్యేక అధికారులు, ఆదర్శ, కేజీవీబీ ప్రత్యేక అధికారులకు ట్యాబ్‌లను అందజేశారు. వీరు ఎప్పటికప్పుడు వారికి అందిన సమాచారంతో సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సరిచేయాలన్న లక్ష్యంతో పథకాన్ని ప్రవేశపెట్టారు. 
    ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడుతుంది
    మండల స్థాయి అధికారులతో పాటు ప్రత్యేక పాఠశాలల అధికారులకు ట్యాబ్‌లు ఇవ్వడం ద్వారా పాఠశాలల పనితీరు ఎప్పటికప్పుడు గమనించి లోపాలుంటే సరిచేయవచ్చు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు పర్యవేక్షించే పనిలేకుండా ఈ ట్యాబ్‌లో ఉన్న డేటా ఆధారంగా చర్యలు చేపట్టవచ్చు.                                                                     -   టీవీజే కుమార్‌. సర్వశిక్షా అభియాన్‌ ఇన్‌చార్జి పీఓ
     

Videos

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)