సమస్యలను పరిష్కరించాలి

Published on Fri, 08/12/2016 - 20:53

ఆమనగల్లు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రెండవ ఏఎన్‌ఎంలు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండవ ఏఎన్‌ఎంలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో ఏఎన్‌ఎంలు ఒకరోజు దీక్షనిర్వహించారు. రెండవ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని, పదో పీఆర్‌సీ ప్రకారం వేతనాలను అందించాలని, ఇతర అలవెన్సులను అందించాలని ఎఎన్‌ఎంలు కోరారు. సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగిస్తామని ఎఎన్‌ఎంలు చెప్పారు. సమ్మెలో రెండవ ఎఎన్‌ఎంలు మంజుల, మారతమ్మ, పద్మ, రాజేశ్వరీ, సునీత, పార్వతి, ఆసీఫా, కరుణశ్రీ, సునీతాబాయి తదితరులు పాల్గొన్నారు.

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ