రెండు పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

Published on Sun, 07/31/2016 - 23:15

  • ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం జాన్‌రెడ్డి
  • ఖమ్మం మామిళ్లగూడెం: గోదావరి అంత్య పుష్కరాలు, త్వరలో ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను తిప్పుతుందని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం జాన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న గోదావరి అంత్య పుష్కరాల కోసం ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, మధిర, సత్తుపల్లి డిపోలతో పాటు ఇల్లెందు నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని వివరించారు. ఈ నెల 11వ తేదీ వరకు సర్వీసులు తిరుగుతాయని, రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని చెప్పారు. 12వ తేదీ నుంచి 23 వరకు ఏపీలో కొనసాగే..కష్ణా పుష్కరాలకు జిల్లా నుంచి విజయవాడ, వేదాద్రి, మట్టపల్లికి 60 బస్సులు తిప్పుతామన్నారు. మధిర నుంచి విజయవాడ, వైరా నుంచి వేదాద్రికి 25బస్సులు, సత్తుపలి ్లనుంచి విజయవాడకు 40, కొత్తగూడెం – విజయవాడ, వేదాద్రికి 35బస్సులు, మణు గూరునుండి–విజయవాడకు 25, భద్రాచలం –విజయవాడ, వేదాద్రికి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు. 50మంది భక్తబందం ఉంటే..ఏపుణ్య క్షేత్రానికి, పుష్కర స్నానఘాట్, పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక చార్జీపై బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
     

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ