amp pages | Sakshi

కన్నీటి పంట

Published on Tue, 03/21/2017 - 03:21

► అకాల వర్షంతో జిల్లాలో భారీగా నష్టం
► దెబ్బతిన్న మొక్కజొన్న, పొగాకు, నువ్వులు
►  బూజుపడుతున్న మిర్చి
►  నూజివీడులో నేలరాలిన మామిడి
►  గింజ రాలిపోతున్న మినుము


మచిలీపట్నం : అకాల వర్షం రైతులకు అపార నష్టం కలగజేసింది. ఊహించని విధంగా ఆదివారం కురిసిన వర్షం, బలమైన గాలులకు మొక్కజొన్న, పొగాకు, నువ్వు, అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా నూజివీడు, బాపులపాడు, పమిడిముక్కల, ముసునూరు, వీరులపాడు తదితర ప్రాంతాల్లో వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న 2,575 ఎకరాలు, పొగాకు 225 ఎకరాలు, నువ్వులు 60 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చేవిషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

మొక్కజొన్న.. ఆందోళనలో రైతన్న
నూజివీడు మండలం తుక్కులూరు, జంగంగూడెం, మోర్సపూడి, బాపులపాడు, పమిడిముక్కల తదితర మండలాల్లో మొక్కజొన్న గింజలు కట్టే దశలో ఉంది. ఈదురుగాలుల ప్రభావంతో గింజలు గట్టిపడవని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30వేల వరకు ఖర్చు చేశామని, కీలకదశలో పైరు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతులకు మరో రూ.10వేలు అదనంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నూజివీడులో 1.60 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈదురుగాలల ప్రభావంతో కాయలు నేలరాలాయి. నూజివీడు మండలంలో పొగాకు పందిళ్లు తడిచిపోయాయి.

తడిసిన మిర్చి
ఈ ఏడాది జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా మిర్చి సాగైంది. ఎకరాకు లక్ష రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా, 10, 15 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి. గతేడాది క్వింటాలు మిర్చి రూ.12,500 ధర పలకగా, ఈ ఏడాది రూ.5,200 నుంచి రూ.5,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. వీరులపాడు, బాపులపాడు తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిచింది. మిర్చి నల్లరంగులోకి మారడం.. బూజుపట్టే అవకాశం ఉండటంతో నాణ్యత తగ్గి ధర మరింత దిగజారుతుందని రైతులు వాపోతున్నారు.

ముంచిన మినుము
జిల్లాలో ఈ ఏడాది 3.86 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేశారు. 60 శాతం మేర మినుముతీత జరిగింది. మిగిలిన 40 శాతం మినుముతీత దశలో ఉంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం కురవడంతో పనలపై ఉన్న మినుము తడిచింది. ఎండిన మినుముకాయలు వర్షానికి తడిచి గింజలు రాలిపోతాయని రైతులు చెబుతున్నారు. మినుముకు జరిగిన నష్టంపై తమకు సమాచారం రాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

Videos

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)