amp pages | Sakshi

నాడు గ్లోబల్స్ ..నేడు రామోజీ

Published on Thu, 05/01/2014 - 02:04

చంద్రబాబు చెప్పే అబద్ధాలు ప్రచారం చేయడమే ఆయన పని    గుంటూరు జిల్లా వైఎస్సార్ జనభేరిలో దుయ్యబట్టిన షర్మిల
 
రామోజీ ఫిల్మ్ సిటీ కోసం అసైన్డ్ భూముల్ని మింగేశారు
మార్గదర్శి ద్వారా రూ. 2,600 కోట్ల డిపాజిట్లు అక్రమంగా స్వీకరించారు
కళాంజలి దుకాణం ద్వారా స్మగ్లింగ్ చేసినట్లు ఆర్కియాలజీ విభాగం నిర్ధారించింది
తోడల్లుడు, కొడుకే ఆయన డబ్బు పిచ్చిని ఈసడించుకున్నారు
అలాంటి రామోజీ అవినీతిపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది
సొంత మామను వెన్నుపోటు పొడిచిన సైకో చంద్రబాబు
నిర్మాతపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన మరో సైకో బాలకృష్ణ
కుప్పంను మునిసిపాలిటీగా మార్చలేదు, రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తాడట
పన్నులేయని సంక్షేమరాజ్యాన్ని అందించింది వైఎస్సార్ ఒక్కరే
జగనన్నకు ఒక్క అవకాశమిస్తే తన జీవితాన్నే అంకితమిస్తాడు

 
  గుంటూరు: ‘‘నాడు జర్మనీ నియంత హిట్లర్ తరఫున గోబెల్స్ ఎలా అబద్ధ ప్రచారాలు చేస్తూ జనాన్ని మోసగించారో... నేడు చంద్రబాబుకు రామోజీ అలా తయారయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోతుంటే... విజయాలమీద విజయాలు సాధిస్తుందని అబద్ధాలు ప్రచారం చేయడానికి గోబెల్స్ అనే ఓ మంత్రిని పెట్టుకున్నారట హిట్లర్. చంద్రబాబు కూడా ఆయనగారి అబద్ధాలను ప్రచారం చేయడానికి రామోజీ అనే గోబెల్స్‌ను పెట్టుకున్నారు. రాష్ట్రం తగలబడిపోతున్నా, కాంగ్రెస్‌పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నా వారికేం పట్టదు. రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే వారి పని. జగన్‌మోహన్‌రెడ్డిపై పేజీలకు పేజీలు అబద్ధాలు రాయడమే వారి ఉద్యోగం. విచిత్రంగా చంద్రబాబుకూ హిట్లర్‌కూ చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరూ ఏప్రిల్ 20 తేదీనే పుట్టారు. హిట్లర్‌లానే చంద్రబాబూ నియంత... బెదిరిస్తూ మాట్లాడతాడు’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ధ్వజమెత్తారు. ‘‘మరోవైపు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడంకోసం పదవులు కాదనుకున్నాడు జగనన్న. విలువలు విశ్వసనీయతే ముఖ్యమనుకున్నాడు. ఆఖరికి చెయ్యని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు. అయినా చెరగని ఆత్మవిశ్వాసంతో బోనులో ఉన్నా సింహం సింహమేనని నిరూపించుకున్నాడు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నకరికల్లు, శిరిగిరిపాడు, గురజాలలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్ జనభేరి ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
 
రామోజీరావు... ఓ 420


  ఊసరవెల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు రంగులు మారుస్తుంటే రామోజీరావు మాత్రం స్వార్థంకోసం రంగులు మార్చేస్తున్నారు. ఆయనో పెద్ద భూబకాసురుడు. రామోజీ ఫిల్మ్ సిటీకోసం ప్రభుత్వ భూములని మింగేశారు. అసైన్డ్ భూముల్ని మింగేశారు. ఆఖరికి గ్రామాలకు గ్రామాలు సైతం మింగేశారు.
 
రామోజీరావు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం. ఈనాడు పత్రికకు రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ఏదైనా భూమిని లీజుకు ఇస్తే అది వెనక్కిచ్చిన దాఖలాలు లేవు. ఆదిత్యవర్మ అని విశాఖపట్నంలో ఒకాయన రూ.130 కోట్ల విలువచేసే భూమిని రామోజీరావుకు లీజుకు ఇస్తే ఆయన్ను నానారకాలుగా హింసించారు రామోజీరావు. ఆఖరికి ఆయన భూమిని 800 గజాలు ప్రభుత్వం రోడ్ విస్తరణకింద తీసుకుంటే రామోజీరావు ఆ స్థలం తనదని తప్పుడు నివేదికలిచ్చి పరిహారం కాజేశారు. దీనిపై 420 కేసు కూడా పెట్టారు.    మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రూ.2,600 కోట్ల డిపాజిట్లు అక్రమంగా స్వీకరించి, ఆస్తులు కూడబెట్టుకున్నారని, స్వయంగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియానే హైకోర్టుకు చెప్పింది. సినిమాలను, సీరియళ్ళను తీసి మళ్ళీ ఆయనే వాటిని కొనుక్కున్నట్లు రూ. 800 కోట్లకు తప్పుడు లెక్కలు చూపిస్తే.. ఇవి దొంగలెక్కలని ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆయనగారి మీద కేసు కూడా పెట్టింది.కళాంజలి అనే ఒక దుకాణం పెట్టి పురాతన వస్తువులను స్మగ్లింగ్ చేసుకుంటూ అమ్ముకుంటున్నారని ఢిల్లీలో ఆర్కియాలజీ డిపార్టుమెంట్ కేసు పెట్టింది. మొత్తంమీద రామోజీరావు మీద 200 కేసులు ఉన్నాయి. హైకోర్టు చరిత్రలోనే ఒక మనిషి మీద ఇన్నేసి కేసులు ఉండటం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.

  సొంత తోడల్లుడైన అప్పారావునే ముంచేశాడు. లంకా దహనం ఎలా అయిందో అలాగే ఒకరోజు రామోజీ దహనం కూడా జరగడం ఖాయమని అప్పారావు తల్లి రామోజీరావుకు శాపనార్థాలు కూడా పెట్టింది.ఆయనకు బంధువులు, మానవత్వం పట్టవు... వట్టి డబ్బు మనిషి. ఒంట్లో ఉన్న కేన్సర్‌ను అధిగమించగలం కానీ ఇంట్లో ఉన్న కేన్సర్‌ను ఎలా అధిగమిస్తామని రామోజీరావు సొంత కొడుకు సుమన్ తండ్రి తీరును దుయ్యబట్టారు. అడుగడుగునా అవినీతిలో కూరుకుపోయిన రామోజీరావు అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత అసహ్యంగా ఉంది.

చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు?

  పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంద న్నట్లు సైకో చంద్రబాబుకు అందరూ సైకోల్లా కనిపిస్తున్నారు. సొంతమామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబుకు మించిన సైకో ఎవరైనా ఉన్నారా లోకంలో? విద్యుత్‌చార్జీలు తగ్గించాలంటూ రైతులు ఉద్యమిస్తే పిట్టల్లా కాల్పించిన సైకో చంద్రబాబు. జీతాలు పెంచమని అడిగిన అంగన్‌వాడీ ఆడపడుచులను గుర్రాలతో తొక్కించిన సైకో చంద్రబాబు. గ్రామంలో పింఛన్ అందుకుంటున్న వారిలో ఒకరు మరణిస్తేనే ఆ స్థానంలో వేరొకరికి పింఛన్ వస్తుందని చెప్పిన బాబుకంటే పెద్ద సైకో ఎవరున్నారు

రాష్ట్రంలో?

  అన్నంపెట్టిన నిర్మాతపై ఆరురౌండ్లు కాల్పులు జరిపిన మరో సైకో బాలకృష్ణ. తర్వాత నిమ్స్‌కు వెళ్లి తనకు మతిస్థిమితం లేదంటూ సర్టిఫికెట్ తెచ్చుకుని కేసునుంచి బయటపడ్డారు. ఆ సర్టిఫికెట్ ప్రకారం ఆయనకు మతిస్థిమితం లేకపోతే ఎన్నికల్లో పోటీచేసే అర్హతలేదు. మతి స్థిమితం ఉంటే దొంగ సర్టిఫికెట్‌తో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆయనపై కేసు పెట్టాలి.తన అవినీతి ఆరోపణల మీద విచారణ జరగకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని తన భుజాన మోశాడు చంద్రబాబు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ ప్రభుత్వానికి రక్షణ కవచంలా కాపాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీలుస్తుంటే కొబ్బరికాయలా ముక్కలు చేసుకోండని విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు.

  దాదాపు 25 ఏళ్లుగా తనను గెలిపిస్తున్న కుప్పం పంచాయతీని మునిసిపాలిటీగా మార్చలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా, జపాన్‌లా చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన మాటల్లో నిజం లేదు, వాగ్దానాల్లో నిజాయితీ లేదు. ఇలాంటి వారికి అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే.అప్పుడు రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ తరం కాదని హేళన చేసిన బాబు ఈ రోజు నిస్సిగ్గుగా ఉచిత విద్యుత్ ఇస్తానని ఎలా చెప్పగలుగుతున్నాడు? అప్పట్లో రైతులను పురుగుల్లా చూసి, ఇప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటూ అబద్ధాలు చెప్తున్నాడు.
 
 

Videos

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)