అమెరికాలో భర్తల వేధింపులకు సంబంధించి vawa చట్ట ప్రకారం భార్యలకు రక్షణ

Published on Sun, 06/12/2016 - 23:23

కేస్ స్టడీ

 

రాఘవేంద్రరావు, రామలక్ష్మి దంపతులు సీనియర్ సిటిజన్స్. వారి ఒక్కగానొక్క కూతురు నీలిమకు ఆరునెలల కిందట ఘనంగా వివాహం చేసి, భర్తతో బాటు అమెరికాకు పంపించారు. అబ్బాయి అమెరికాలోనే చదువుకుని, అక్కడే మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. ఎన్నారై సంబంధం కదా అని కోటిరూపాయలదాకా కట్నం ముట్టచెప్పారు రాఘవేంద్రరావు. అయితే పెళ్లయి అమెరికా వెళ్లినప్పటినుంచి అమ్మాయి సంతోషంగా లేదని, భర్త తీవ్రమైన గృహహింసకు పాల్పడుతున్నాడీ, మానసికంగా, శారరకంగా వేధిస్తున్నాడని అతనికి తెలిసింది. అతి కష్టం మీద కూతురు వారికి ఈ విషయాలు చేరవేసింది. తాను భర్తపై న్యాయపోరాటం చేస్తానని, మీరు ధైర్యంగా ఉండ ండని చెప్పింది.


అయితే తనకు అక్కడ ఏ చట్టాన్ని ఆశ్రయించాలో అర్థం కావట్లేదని తెలియజేసింది. అక్కడి గృహహింసకు సంబంధించి ఏ చట్టం ఉందో అవగాహన కోసం న్యాయవాదిని సంప్రదించారు రాఘవేంద్రరావు. అమెరికాలో భర్తల వేధింపులకు సంబంధించి ‘వయొలెన్స్ అగెనైస్ట్ ఉమెన్ యాక్ట్’ (గఅగిఅ) ఉందని, ఆ చట్టాన్ని అనుసరించి బాధితురాలైన గృహిణులకు రక్షణ, నివాసం, జీవనభృతి, న్యాయసహాయం లభిస్తాయని, అమెరికాలో ఉండి చట్టాన్ని ఆశ్రయించిన మహిళలకు వారి దరఖాస్తు మేరకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదా కల్పిస్తారని న్యాయవాది తెలియజేశారు. కూతురికి ‘వావా’ చట్టం గురించి చెప్పి, అక్కడి లాయర్లను సంప్రదించమని చెప్పారు రాఘవేంద్రరావు దంపతులు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ