పరువు హత్య

Published on Sat, 05/16/2015 - 00:51

సాంకేతికంగా మనిషి శిఖరాలకు చేరుకుంటున్నా... సంస్కారంలో మాత్రం పాతాళంలోకి కూరుకుపోతున్నాడు. మార్పు కోసం ఎన్ని కాగడాలు వెలిగించినా... చీకటి ఇంకా మహిళలను వేటాడుతూనే ఉంది.

కడుపులో బిడ్డ ఉండగానే చంపి పాతరేశారు..పరువు ముందు మానవత్వం సమాధి అయిపోయింది..  ప్రతిష్ఠ కోసం కన్నవారే కసాయిలయ్యారు.. అలాంటి తల్లిదండ్రులు మారాలా? వాళ్లను అలా తయారుచేసిన సమాజం మారాలా? పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం!
 పోయిందనుకున్న పరువుకి అర్థంలేదని  చెప్పలేమా?!
 
నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంభాలపల్లి గ్రామపంచాయితీ పరిధిలో.. విసిరేసినట్టున్న తండా. చుట్టూ కొండల నడుమ ఒదిగిన గువ్వల గుట్ట. రమావత్ చిన్ని, రమావత్ హర్యా ఆ తండాలోని ఓ జంట. వాళ్లకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. నిరుపేద గిరిజన కుటుంబం. కూతురు పేరు శారద. తొలి చూలు. చదువు చెప్పించలేదు. గొర్రెలు, మేకలు కాయడానికి అడవికి వెళ్ళొస్తుండేది. ఈ క్రమంలోనే ఆ తండాకు చెందిన ఓ వ్యక్తి శారదకు పరిచయమయ్యాడు. ఆ పరిచయ ఫలితం.. అమ్మాయి గర్భవతి అవడం. అమ్మాయిలో వస్తున్న మార్పులు తల్లిదండ్రుల్లో అనుమానం రేకెత్తించాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని అనిపించినా భయంతో మిన్నకుండి పోయారు. ఉన్నట్టుండి ఒకరోజు కడుపు నొప్పి అంటూ పిల్ల మెలికలు తిరిగి పోతుంటే గువ్వల గుట్టకు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ల భయాన్ని, అనుమానాన్ని డాక్టర్ నిర్ధారించింది కూతురు గర్భిణీ అని చెప్పి. ఊహించిందే అయినా అబద్ధమేమో అని ఏ మూలో ఉన్న ఆశ ఆవిరై ఆ దంపతులను కుప్పకూలేలా చేసింది. ఆ పరిస్థితికి కారణమైన వాడిని పట్టుకోవాలన్న యోచన కన్నా కూతురు తప్పు చేసింది అన్న భావనే వాళ్ల మెదళ్లలో నిండింది.

కడుపులోని పిండాన్ని తీసేయమన్నారు. ‘ఈ టైమ్‌లో కుదరదు’ అంది డాక్టర్. ఏం చేయాలో... ఏం మాట్లాడాలో తెలియక తిరుగు ముఖం పట్టారు. కాని ఊళ్ళోకెళ్తే తండావాసుల ముందు తలెత్తుకోలేమనే చింత వాళ్లను అడుగు ముందుకు వేయనీయలేదు. మార్గమధ్యంలో గుట్టల వద్ద కూతుర్ని నిలదీశారు. జరిగిన విషయాన్ని కూతురు పూసగుచ్చినట్టు చెప్పింది. గుండెలవిసేలా ఏడ్చారు. ఆ ఏడుపు క్రమంగా భరించలేని కోపం.. అవమానంగా మారింది. తలమీదున్న తమ పరువు తండా ముందు కూలిపోయి కనిపించింది. కంపించారు... కన్న బిడ్డ అన్న మమకారం .. గర్భంతో ఉందన్న మానవ త్వం వీళ్లను విడిచి వెళ్లిపోయాయి. బిడ్డ గొంతు నులిమి చంపేశారు. ఊరి సరిహద్దులోనే.. గొయ్యి తీసి పూడ్చేశారు.

ఆ నోటా... ఈ నోటా ...

శారద కనిపించకపోవడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. విషయం ఆ నోట ఈ నోట బంధువులకు సమాచారం చేరింది. తల్లిదండ్రులను ప్రశ్నించారు. నిజం చెప్పక తప్పలేదు ఆ తల్లిదండ్రులకు. కులాచారం ప్రకారం గర్భిణీని పూడ్చిపెట్టడం తప్పన్నారు. ఆ చావు తండా తండాకే అరిష్టమన్నారు. గుట్టుచప్పుడు కాకుండా తండావాసులంతా ఏకమై పూడ్చిన శారద శవాన్ని బయటకు తీశారు. శారద పొట్ట కోసి లోపలున్న శిశువును వేరు చేశారు. ఆ పక్కనే మరో గొయ్యి తీసి ఆ శిశువును పాతిపెట్టారు. ఆనోటా... ఈ నోటా విషయం బయటకు పొక్కింది. దీంతో అధికారులు, పోలీసులు తండా ప్రవేశం చేశారు. మీడియా కథనాలు రాసింది. తల్లిదండ్రులపై కేసు నమోదైంది. కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతున్నారు. ఓ పదిరోజులు పెద్ద హడావిడే జరిగింది. ఈ వారంపదిరోజుల్లో ఈ కేసు కోర్టులో హియరింగుకు రాబోతోంది. ఈ సంచలనం రేపిన హడావుడికి ఆ తండాలోని ఫాల్స్‌ప్రెస్టీజ్ భావన చచ్చిపోయి.. గొప్ప మార్పే చోటుచేసుకుంది అనుకునేరు. మూఢాచారాలు, శిశు విక్రయాలు, భ్రూణహత్యలు వంటివి దైనందిన చర్యలో భాగంగా జరిగిపోతూనే ఉన్నాయి.
 - కొంగరి మధు, సాక్షి, దేవరకొండ
 
కేసు నడుస్తూనే ఉంది

2011లో జరిగిన ఈ సంఘటనలో తల్లిదండ్రుల మీద కేసు నమోదయింది. కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ వారంలో ఈ కేసు జిల్లా కోర్టుకు బదిలీ చేసే అవకాశముంది. అప్పుడప్పుడు ఈ కేసుపై ఉన్నతాధికారులు కూడా వాకబు చేస్తుంటారు.
 - ప్రసాద్, కానిస్టేబుల్
 
ఇన్నేళ్ళయినా ఆ సంఘటన కళ్ళముందే కనిపిస్తుంది


ఈ సంఘటన సమాచారం అందడంతోనే అధికారులు నన్ను హుటాహుటీన అక్కడికి పంపారు. నా కళ్ళ ముందే శవాలను బయటకు తీశారు. వందల మంది గుమికూడారు. ఏడ్పులు, పెడబొబ్బలు, మరికొందరైతే గుండెబిగబట్టుకుని నిలబడ్డారు. వైద్యులు శిశువుకు సంబంధించిన అవయవాలను డీఎన్‌ఏ టెస్ట్ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఆ రోజు నాకింకా గుర్తు... ఆ శవాల దగ్గర నన్నే కాపలాగా ఉండమన్నారు.  - నూనె శ్రీను, వీఆర్వో
 
అవేర్‌నెస్సే పరిష్కారం

జనరల్‌గా అధికారం కోసం కులం, మతం వంటివాటిని అడ్డంపెట్టుకుంటారు. వీటిని భావోద్వేగాలతో ముడిపెట్టి ప్రజలను రెచ్చగొడుతుంటారు. అయితే ఇవి చిన్న సమూహాలు లేదా కమ్యూనిటీలకు చేరినప్పుడు కుల పోట్లాటలు, పరువు హత్యలు వంటివి జరుగుతుంటాయి. ఈ అజ్ఞానానికి ఎక్కువ, తక్కువ, పేద, ధనిక బేధాల్లేవ్. వీటికి పరిష్కారం ప్రజల్లో చైతన్యం రావడమే.  - ఫణి ప్రశాంత్, సైకాలజిస్ట్
 
 
 

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)