amp pages | Sakshi

త్రీమంకీస్ - 60

Published on Wed, 12/17/2014 - 22:49

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 60
 
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘ఏమిటా విండోస్?’’ గోడకి ఆనించి ఉన్న కిటికీలని చూసి మర్కట్ అడిగాడు.
 ‘‘అప్పుడప్పుడూ విండో షాపింగ్‌కి వెళ్ళొస్తూంటాను. కుక్క తోకని కూడా కాలు అనుకుంటే కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి?’’
 ‘‘ఐదు’’ బుష్‌ని చూస్తూ వేళ్ళతో లెక్కపెట్టుకుని మర్కట్ జవాబు చెప్పాడు.
 ‘‘తప్పు. నాలుగే. తోకని కాలని అనుకున్నంత మాత్రాన అది కాలు కాదు. ఇంకోటి అడగనా?’’ వైతరణి నవ్వుతూ అడిగింది.
 ‘‘ఒద్దు. ఒకే కుక్క చేత రెండుసార్లు కరిపించుకునేవాడు మూర్ఖుడు అవుతాడు.’’
 వాళ్ళిద్దరూ దుప్పటి కిందకి చేరాక వైతరణి తన గౌన్‌ని విప్పి మంచం కింద పడేస్తూ అడిగింది.
 ‘‘లైట్‌లోనే ఇష్టం అన్నాగా? చెప్పండి. మనకి పుట్టే పిల్లల బంగారు భవిష్యత్‌కోసం ఏం చేద్దాం?’’
 ‘‘టీ అమ్మే వాడిలా పెంచి మోడీని చేయచ్చు. లేదా ఐఐటిలో చదివించి కేజ్రీవాల్‌ని చేయచ్చు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘విదేశాల్లో మాత్రం చదివించద్దండి’’ ఆలోచించి చెప్పింది.
 ‘‘ఏం?’’
 ‘‘రాహుల్ గాంధీలా తయారవుతాడు.’’
 19
 ‘‘మీరు అసలు ఇంగ్లీష్ మందులే వాడరా?’’ వానర్ అడిగాడు.
 ‘‘ఊహూ. ఇంగ్లీష్ మందు తీసుకుంటే రెండుసార్లు రికవర్ అవాలి. ఓసారి జబ్బు నించి. ఇంకోసారి ఆ మందు నించి.’’
 ‘‘మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు లేదా? అది మంచిదని డాక్టర్లు చెప్తారే?’’ వానర్ అడిగాడు.
 ‘‘ఏది తిని ఫాస్ట్‌ని బ్రేక్ చేస్తామో టెక్నికల్‌గా అదే బ్రేక్‌ఫాస్ట్. అందువల్ల ప్రపంచంలో బ్రేక్‌ఫాస్ట్ తినని వారే ఉండరు’’ డాక్టర్ మూలిక చెప్పింది.
 ‘‘ఈ రాత్రి వంట నేను చేయనా? లేక మీరు చేస్తారా?’’ వానర్ మళ్ళీ అడిగాడు.
 ‘‘ఇద్దరం కలిసి చేద్దాం.  అప్పుడే మర్చిపోయావా? నాన్ సెక్స్‌వల్ ప్రేమలో నంబర్  నైన్, కుక్ ఏ మీల్ టుగెదర్. కలిసి వంట చేయడం కూడా ప్రేమని వ్యక్తం చేసే ఓ పద్ధతి’’ డాక్టర్ మూలిక చెప్పింది.
 వానర్ ఫ్రిజ్ తెరిచి కూరలు ఉంచే క్రిస్పర్ బాక్స్‌ని తెరిచి చూశాడు.
 ‘‘అందులో అనేక రకాల ఆకులు, కొమ్మలు, బెరళ్ళు, భస్మాలు కనిపించాయి. వాటిని చూసి చెప్పాడు.
 ‘‘లేవు. నేను వెళ్ళి తెస్తాను.’’
 ‘‘ఏం లేవు?’’ మూలిక అడిగింది.
 ‘‘వంకాయలు. ఉల్లిపాయలు. ఉల్లి కారం పెట్టిన వంకాయ కూర తినాలని ఉంది.’’
 ‘‘ఉల్లిపాయా! వంకాయా!’’ మూలిక పక్కలో బాంబ్ పడ్డట్లుగా అరిచింది.
 ‘‘ఏం?’’
 ‘‘వంకాయ సర్వరోగప్రదాయిని అని వినలేదా? దాన్ని చస్తే తినకూడదు. తింటే త్వరగా చస్తాం అని ధన్వంతరి రాశాడు. ఉల్లిపాయ గాలే అసలు మనకి తగలకూడదు అని చరకుడు రాశాడు. ఈ రెండూ ఆయుర్వేదంలో నిషిద్ధం.’’
 ‘‘పోనీ దొండకాయ, ఉల్లి కారం కూర?’’
 ‘‘దొండ పరమ నిషిద్ధం. వెనకటికి ఒకడికి దొండ పాదు కింద స్నానం చేస్తే బుద్ధి మాంద్యం పట్టుకుందని చరకసంహితలో రాసుంది. అది మనిషిని నిస్తేజంగా మారుస్తుంది.’’
 ‘‘వంకాయ, దొండకాయలకే ఉల్లి కారం వేసి వండితే బావుంటుంది. ఒక్కసారికేం కాదు.’’
 ‘‘ఊహూ. అవి రెండూ వాతపిత్త దోషాలని కలిగిస్తాయి.’’
 ‘‘పోనీ చామదుంపలు తెస్తాను. వేయించి ఇంత ధనియాల పొడి, ఉప్పూ, కారం చల్లి...’’
 ‘‘నో. నో. నో. నో... దుంపకూరలు కూడా నిషిద్ధం. నేల అడుగున పండే వాటిలో ఒక్క వేరుశెనగ మాత్రమే శ్రేష్టం. మిగిలినవన్నీ వర్జింప తగ్గవి. అవన్నీ వాతాన్ని కలిగించేవి.’’
 ‘‘కాని రాముడు అరణ్యవాసంలో కందమూలాలనే తిని జీవించాడు కదా?’’
 ‘‘రాముడు దేవుడు. నువ్వు మనిషి.’’
 వానర్ కొద్దిసేపు ఆలోచించి తనకి ఇష్టమైన కూరలని, వాటిని వండే విధానాలని చెప్పాడు. ఆమె వేటికి వాతపిత్తకఫ దోషాలో చెప్పి ఖండించేసింది.
 ‘‘బెండకాయ?’’
 ‘‘అది కొంత దాకా ఓకే.’’
 ‘‘సరే. బెండకాయ, వేరుశెనగపప్పు కలిపి వేపుడు చేస్తే?’’
 ‘‘ఈరోజు చతుర్దశి. చతుర్దశి నాడు బెండకాయ తింటే ఆవు మాంసం తిన్నంత పాపం వస్తుంది అని ఆయుర్వేద రత్నావళిలో రాశారు.’’
 ‘‘పోనీ సొరకాయలో పాలు పోసి వండుదామా?’’ వానర్ ఆశగా అడిగాడు.
 ‘‘రాత్రి పూట సొరకాయ నిషిద్ధం. జలుబు చేస్తుంది.’’
 ‘‘సరే. ఈరోజు తిథికి, ఈ వారానికి ఏవి సూటబుల్?’’ బలహీనంగా అడిగాడు.
 ‘‘తోటకూర పొడికూర, బచ్చలి పులుసు, గంగబాయిల కూర పచ్చడి.’’
 ‘‘అదేమిటి? ఆక్కూరతో పచ్చడా? ఎక్కడా వినలేదే?’’
 ‘‘చేస్తాగా. తిని చూసి మాట్లాడు. ముందుగా ఆకుకూరలని ఇసక పోయేలా బాగా కడిగి కాడల నించి ఆకులని వేరు చేయి... నా వంటంటే అంతా పడి చస్తారు.’’
 (కోక్ ఫ్రిజ్‌లో కాకుండా టాయ్‌లెట్‌లో
 ఎందుకు ఉంది?)
 

Videos

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)