amp pages | Sakshi

విక్టరీ వెంకటేష్‌ ఎంచుకున్న మార్గం ఏమిటి?

Published on Sun, 12/07/2014 - 21:48

టాలీవుడ్‌ టాప్‌ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. క్లాస్‌ మూవీస్‌తో మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎప్పటికప్పుడు పెంచేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య వెంకీ తనకున్న క్రేజ్ పెంచుకోడానికి సరికొత్త రూట్‌ కనిపెట్టారు. అదే రీమేక్. సేఫ్‌ ఫార్ములా. రీమేక్స్తో విజయపధంలో దూసుకువెళుతున్నారు.  తన సక్సెస్‌ రేట్‌ పెంచుకోవడానికి రీమేక్‌ మూవీస్‌లో నటించడానికే ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు.  ఈ ఏడాది ఇప్పటికే మలయాళంలో ఘనవిజయం సాధించిన దృశ్యంను అదే పేరుతో తెలుగులోకి రీమేక్‌ చేసి హిట్‌ అందుకున్నారు. దీంతో పాటు పవన్‌ కళ్యాణ్‌తో  చేస్తున్న మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల సైతం హిందీలో హిట్ అందుకున్న ఓ మైగాడ్‌ మూవీకి రీమేక్. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకులలోనూ చాలా అంచనాలు ఉన్నాయి.  గోపాల గోపాల ఘనవిజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.

వెంకీ టాలీవుడ్‌లో చేస్తున్న డైరెక్ట్ సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. దీంతో  ఇతర భాషల్లో హిట్ అయిన కథలను టాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. తను ఫాలో అవుతున్న ఈ సేఫ్‌ ఫార్ములాతో అటు సక్సెస్‌ సాధిస్తున్నారు.  ఇటు యూత్‌లో క్రేజ్‌ను పెంచుకుంటున్నారు.  కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సలీమ్‌ అనే చిత్రాన్ని కూడా తెలుగులోకి రీమేక్‌ చేసేందుకు ఈ స్టార్ హీరో సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ సినిమా తప్పకుండా టాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చుతుందని వెంకీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
**

Videos

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)