రాయకుండా ఉండలేకపోయా!

Published on Fri, 09/12/2014 - 00:17

పెత్తందార్ల అమానుష ప్రవర్తనలను తెలియజేసిన తెలుగు ఆధునిక నాటకం ‘కుక్క’ రజతోత్సవ సంవత్సర నేపథ్యంలో ఆత్రేయ, ఎన్.ఆర్.నంది వంటి ఆధునిక నాటక రచయితలకు కొనసాగింపుగా ప్రశంసలు పొందిన యండమూరి  వీరేంద్రనాథ్ ‘కుక్క’ రూపొందిన వైనాన్ని నెమరువేసుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
‘రాయాలని రాసింది కాదు. రాయకుండా ఉండలేక రాసింది. నా సమక్షంలో జరిగిన వాస్తవిక సంఘటన  నన్ను క్షుభితం చేసింది. ఆ అల్లకల్లోలాన్ని ఎలా వ్యక్తీకరించాలా? అని ఆలోచించాను. 1960ల్లో బ్యాంక్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్ జిల్లా కడెం అనే గ్రామం వెళ్లాను. నేను పనిచేస్తున్న జాతీయ బ్యాంకులో గౌరవంగా అప్పుతీసుకున్నాడు ఓ పటేలు. రికవరీ పనిపై మేం పటేలు ఇంటికి వెళ్లాం. మా దగ్గర అప్పుతీసుకున్న పటేలు గ్రామంలో అప్పులు ఇచ్చేవాడు. రికవరీ ఎలా చేసేవాడు? ఇంట్లోనే! వడ్డీకట్టని జీతగాళ్లను బండబూతులు తిడుతూ! నా సమక్షంలోనే పటేలు భార్య ఒక జీతగాణ్ణి కొట్టింది.. గంటెతో. నెత్తురు కక్కుకున్నాడు జీతగాడు! అతడు చేసిన నేరం? పటేలమ్మ పెట్టిన కూర అతడి చేతిలోంచి పడిపోవడమే!
 ‘మనుషులను కుక్కలకంటే హీనంగా చూస్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం’ అని బలంగా చెప్పాలని నేను చేసిన ప్రయత్నం ‘కుక్క’గా రూపొందింది.
 
 ‘కుక్క కావాల్నా నాయినా..!
 ఒరే జీతగాడా, నువ్ జర కుక్కతీర్గ నిలబడరా...’
 అన్న డైలాగ్‌కు ఎన్ని కనులు కన్నీరు కార్చాయో! ఎన్ని కన్నులు ఎర్రనయ్యాయో! కాబట్టే పదివేలసార్లకు పైగా ప్రదర్శితమైంది. ఇప్పుడు ‘నిశుంభిత’ తెలుగు
 నాటకాలను ప్రదర్శించే క్రమంలో ‘కుక్క’ను ప్రదర్శిస్తోంది!
 - ‘కుక్క’ రచయిత యండమూరి

కుక్క నాటిక ప్రదర్శన నేడు
‘నిశుంభిత’ సంస్థ ఆధ్వర్యంలో
దర్శకత్వం: రామమోహన్ హొలగొంది
సమయం: సాయంత్రం 7.30 గంటలు
వేదిక: లామకాన్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 1
పాస్‌లకు: 9849256440

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)