కొండెక్కిన కోడి!

Published on Mon, 06/01/2015 - 05:33

స్కిన్‌లెస్  కిలో రూ.178
 సాక్షి, హైదరాబాద్: చికెన్ ధర మండిపోతోంది. ఎండాకాలం వేడి చేస్తుందన్న ఉద్దేశంతో చికెన్ వినియోగించేందుకు మాంసాహారులు వెనుకడుగేస్తుంటారు. ఫలితంగా వేసవిలో చికెన్ ధరలు పడిపోవడం ఏటా సర్వసాధారణం. అయితే...  నగరంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లో చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవలి వరకు రూ.122లకు లభించిన బ్రాయిలర్ చికెన్ 20 రోజుల వ్యవధిలోనే కిలో ఒక్కింటికి రూ.30 వరకు ధర పెరిగింది. ఆదివారం రిటైల్ మార్కెట్లో లైవ్ కోడి కేజీ రూ.106, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.152, స్కిన్‌లెన్ రూ.178, బోన్‌లెస్ రూ.340 ధరకు వ్యాపారులు విక్రయించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా గత నెలలో పౌల్ట్రీ యజమానులు పెద్దసంఖ్యలో కోళ్లను చంపేశారు. ఆతర్వాత కొత్త బ్యాచ్‌లు వేయకుండా ఆపేశారు. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి నిలిచిపోయి నగరంలో కొరత ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జోరందుకోవడంతో చికెన్‌కు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేశారు.
 
 గత నెలలో కొత్త బ్యాచ్‌లు వేయకపోవడం, ఉన్నవి కూడా ఎండదెబ్బకు చనిపోవడంతో బర్డ్స్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడింది. ఆ ప్రభావమే ఇప్పుడు ధరల పెరుగుదలకు దారితీసిందని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం నుంచి చికెన్ ధరలు రూ.8-12 వరకు పెరగనున్నాయని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. గుడ్ల ధరలు కూడా అస్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో 100 కోడి గుడ్ల ధర రూ.310 ఉండగా, రిటైల్ మార్కెట్లో  రూ.400 చొప్పున అమ్ముతున్నారు. నిజానికి ఒక్కో గుడ్డు ధర రూ.3.10 పైసలుండగా రిటైల్ వ్యాపారులు మాత్రం రూ.4 వసూలు చేస్తున్నారు. వేసవిలో చికెన్ ఇష్టపడనివారు మటన్ వైపు మొగ్గుచూపుతుండటంతో మార్కెట్లో మటన్ ధరలు కూడా పెరిగాయి.  గతవారం వరకు కేజీ మటన్ రూ.450-500లున్న ధర  ప్రస్తుతం రూ.480-550కి చేరింది.
 

Videos

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)