amp pages | Sakshi

ఇంజినీరింగ్ విద్యార్థికి కత్తిపోట్లు

Published on Tue, 03/11/2014 - 23:23

మొయినాబాద్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్ విద్యార్థిపై అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్(20) మండలంలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మండల పరిధిలోని బాకారం గ్రామానికి చెందిన జయరాంరెడ్డి(22) అదే కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అరుణ్‌కుమార్ తల్లి మొయినాబాద్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే సోమవారం సాయంత్రం అరుణ్‌కుమార్ మొయినాబాద్ బస్టాపులో తన తల్లికోసం వేచి చూస్తున్నాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన జయరాంరెడ్డి అతణ్ని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
 
  స్థానికులు కలుగజేసుకుని ఇద్దర్ని అక్కడినుంచి పంపించేశారు. ఆ తరువాత రాత్రి 10 గంటల సమయంలో అరుణ్‌కుమార్‌కు జయరాంరెడ్డి ఫోన్‌చేసి గొడవ విషయం మాట్లాడుకుని రాజీ అవుదామని మొయినాబాద్‌కు పిలిపించాడు. జయరాంరెడ్డి తన స్నేహితులు రాంరెడ్డి, మాణిక్‌రెడ్డి, సాయి, వినాయక్‌రెడ్డి, ఓంరెడ్డితో కలిసి  హోటల్ పక్కన ఉన్న గల్లీలోకి అరుణ్‌కుమార్‌ను తీసుకెళ్లారు. అక్కడ ఒక్కసారిగా అరుణ్‌కుమార్‌ని జయరాంరెడ్డి కత్తితో కడుపులో పొడిచాడు. మరోసారి పొడిచేందుకు యత్నించగా అది అరుణ్‌కుమార్ ఎడమచేతికి తగిలింది. అనంతరం వారంతా అక్కడినుంచి పరారవగా అరుణ్‌కుమార్ మొయినాబాద్‌లో ఉండే తన స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్లాడు. వెంటనే సురేష్ ‘108’కు, పోలీసులకు సమచారం అందించి స్థానికుల సహాయంతో బాధితుణ్ని షాదన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
 నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ర్యాలీ...
 బీటెక్ విద్యార్థి అరుణ్‌కుమార్‌పై దాడిచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మొయినాబాద్‌లో ఉన్న అరుణ్‌కుమార్ స్నేహితులు, స్థానికులు కలిసి మండల కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐ రవిచంద్రను కోరారు. పాతకక్షల నేపథ్యంలోనే విద్యార్థిపై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మిగిలినవారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జయరాంరెడ్డిని కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
 
 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)