amp pages | Sakshi

ఎల్వీ సుబ్రమణ్యానికి ఊరట

Published on Fri, 01/05/2018 - 01:02

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఏపీ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎమ్మార్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది.

సుబ్రమణ్యంపై సీబీఐ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని.. ఎమ్మార్‌కు భూకేటాయింపులు, ధర నిర్ణయం పూర్తిగా ప్రభుత్వా నిదేనని, అందులో ఏపీఐఐసీ ఎండీగా ఉన్న సుబ్రమణ్యానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలనే ఆయన అమలు చేశారని, ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొంది. న్యాయ మూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు గురువారం తీర్పు వెలువరించారు.

అనుమతిలోనే పొరపాటు..
ఎమ్మార్‌ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం గతేడాది మార్చి 16న హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు 169 పేజీల తీర్పు వెలువరించారు. సుబ్రమణ్యం ప్రాసిక్యూషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చేందుకు తిరస్కరించిందని.. కానీ కేంద్రం అనుమతిని చ్చిందని అందులో పేర్కొన్నారు.

ప్రాసి క్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు సరికాదనే కారణాలు వివరించ కుండానే కేంద్రం అనుమతివ్వడం సరికాదన్నారు. అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. సీబీఐ ఇచ్చిన చార్జిషీట్‌లోని అంశాలనే పరిగణనలోకి తీసుకుంటూ సుబ్రమణ్యం ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఇక ఎమ్మార్‌ భూకేటాయింపుల్లో సుబ్రమణ్యం స్వీయ నిర్ణయాలు ఎక్కడా లేవని.. కేబినెట్‌ నిర్ణయాలనే అమలు చేశారని స్పష్టం చేశారు.

చాముండేశ్వరినాథ్‌కు విల్లా కేటాయింపుల్లో సుబ్రమణ్యం సిఫార్సు చేసినట్లుగా సీబీఐ ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయిందని తేల్చారు. ప్రాజెక్టు అమలయ్యే నాటికి ఆయన పదవిలో లేరని స్పష్టం చేస్తూ.. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేశారు.

Videos

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)