భారత్‌తో కలిసి పనిచేస్తాం: అమెరికా

Published on Sat, 06/22/2019 - 09:29

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు భారత్‌ పర్యటనకు రానున్న పాంపియో గురువారం భారత్‌ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. భారత విదేశాంగ మంత్రిగా నియమితులైన జయశంకర్‌కు పాంపియో అభినందనలు తెలిపారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ నేత ఒకరు భారతలో పర్యటించడం ఇదే ప్రథమం.

28నుంచి జపాన్‌లో జరిగే జి–20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమావేశం కానున్న నేపథ్యంలో పాంపియో భారత పర్యటనకు ప్రాధాన్యం లభించింది. పర్యటనలో భాగంగా పాంపియో విదేశాంగ మంత్రి జయశంకర్, తదితర మంత్రులతో సమావేశమవుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ తెలిపారు.‘భారత్‌ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పరం లాభదాయకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలకు ఈ పర్యటన చక్కని అవకాశంగా భావిస్తున్నాం.’అని కుమార్‌ అన్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ