amp pages | Sakshi

బక్కెట్లకొద్దీ డబ్బు దొరికింది!

Published on Fri, 07/01/2016 - 20:28

ఫ్లోరిడాలో పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. ఓ ఇంట్లో భద్రంగా దాచిన 24 బక్కెట్లలో కోట్ల కొద్దీ డబ్బు కనిపించడంతో  షాక్ అయ్యారు. అక్రమ వ్యాపారం నిర్వహించగా  వచ్చిన డబ్బును మియామీ ప్రాంతంలోని ఓ వ్యాపారి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన వార్త.. ఇప్పుడక్కడ  పెద్ద సంచలనంగా మారింది.

అటకమీద ఎవ్వరికీ కనిపించకుండా దాచిన బక్కెట్లనిండా డబ్బుతోపాటు, కొన్ని డ్రగ్స్, ఓ గన్ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికా ఫ్లోరిడాలోని మియామీలోని ఓ ఇంట్లో  తన అక్రమ వ్యాపారంతో సంపాదించిన డబ్బును సదరు వ్యాపారి బక్కెట్లలో భద్రంగా దాచుకున్నాడు. ఇంటి అటకమీద 24 బక్కెట్లలో దాచిపెట్టిన 163 కోట్ల రూపాయలను (సుమారు 20 మిలియన్ డాలర్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొమ్ముతోపాటు, అత్యంత ఖరీదైన తుపాకీ, కొన్ని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్న మియామీ పోలీసులు.. వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. 44  ఏళ్ళ లూయిస్ హెర్నాండెజ్ గాంజలెజ్, ఆయన సోదరి 32 ఏళ్ళ సల్మా గాంజలెజ్ లను అక్రమ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేసులో అరెస్టు చేశారు.  

గార్డెన్ సామాన్లు అమ్మే బిజినెస్ నిర్వహిస్తున్న నిందితులు, అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం కూడ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. వారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లోని అటకపై భద్రంగా దాచిపెట్టిన బక్కెట్ల కొద్దీ డబ్బును,  డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిద్దరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెర్చ్ వారెంట్ తో నిందితుల ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు అటకపై ఉన్న బక్కెట్లు చూసి షాకయ్యారు. వాటితోపాటు ఎనబాలిక్ స్టెరాయిడ్లు, టీఈసీ-9 పిస్టల్ కనిపించడంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. వెంటనే అలర్టయిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని  అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌