భయంతో.. యూఎన్‌కు..!?

Published on Sat, 09/16/2017 - 14:30

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సమావేశాల్లో పాల్గొంటారని పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్‌ ప్రధానిగా తొలిసారి న్యూయార్క్‌ వెళ్లనున్నా ఆయన.. అక్కడ ప్రపంచ దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశామవుతారని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమితి నుద్దేశించి పాక్‌ ప్రధాని చేసే ప్రసంగంలో కశ్మీర్‌తో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో భారత్‌-అమెరికా, భారత్‌-జపాన్‌ల బంధం బలోపేతం కావడం, రక్షణ, సాంకేతిక, అణు రంగాల్లో భారత్‌ ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక బంధాలను పెంచుకోవడంతో పాక్‌ కలవరపాటుకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాధినేతలతో పాక్‌ ప్రధాని సమావేశం కావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సమితిలో పాక్‌ ప్రధానికి చైనా పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలుస్తోంది.


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ