బాయ్ఫ్రెండ్ను నమ్మి.. మోసపోయా

Published on Wed, 02/24/2016 - 18:54

ఎర్బిల్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెరలో జీవితం నరకప్రాయమని, బాయ్ఫ్రెండ్ను నమ్మి మోసపోయానని ఉగ్రవాదుల బారి నుంచి బయటపడ్డ ఓ స్వీడన్ యువతి తాను పడ్డ కష్టాలను వెల్లడించింది. ఈ నెల 17న ఇరాక్లో ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ఈ 16 ఏళ్ల అమ్మాయిని కుర్దిస్ ప్రత్యేక బలగాలు రక్షించాయి. త్వరలో స్వీడన్ అధికారులకు అప్పగించనున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో బాధితురాలు తన కష్టాలను చెప్పింది. ఆమె మాటల్లోనే..

2014లో స్కూల్ మానేశాక బాయ్ఫ్రెండ్ కలిశాడు. మొదట్లో మా సంబంధం బాగుండేది. ఆ తర్వాత అతను ఐఎస్ వీడియోలను చూస్తూ, వారి గురించి మాట్లాడుతుండేవాడు. క్రమేణా ఐఎస్ పట్ల ఆకర్షితుయ్యాడు. ఐఎస్లో చేరాలని అతను చెబితే నేను అభ్యంతరం పెట్టలేదు. ఎందుకంటే నాకు ఐఎస్ గురించి ఏ మాత్రం తెలియదు. 2015 మేలో స్వీడన్ విడిచి వెళ్లాం. బస్సులు, రైళ్ల ద్వారా యూరప్లో ప్రయాణించి, టర్కీ సరిహద్దు ప్రావిన్స్ గజియటెప్ చేరుకున్నాం. అక్కడి నుంచి సిరియా వెళ్లాం. ఐఎస్ ఉగ్రవాదులు ఇతరులతో కలసి మమ్మల్ని బస్లో ఇరాక్ సరిహద్దున గల మోసుల్ నగరానికి తీసుకెళ్లారు. అక్కడ మాకో ఇల్లు ఇచ్చారు. ఇంటికి కరెంట్ లేదు. తాగునీళ్లు లేవు. నా దగ్గర డబ్బు లేదు. అక్కడ ఎన్నో కష్టాలుపడ్డా. ఫోన్ ద్వారా అమ్మతో మాట్లాడేందుకు ప్రయత్నించా. ఇంటికి రావాలని ఉందని చెప్పా. స్వీడన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉండేది. ఐఎస్ ఉగ్రవాదుల దగ్గరకు వెళ్లాక ఏదీ లేకుండాపోయింది. చివరకు విముక్తి లభించింది.

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ