స్పెయిన్‌లో 17 వేల కోట్ల లాటరీ

Published on Mon, 12/23/2019 - 02:15

బార్సిలోనా: క్రిస్మస్‌ను పురస్కరించుకొని స్పెయిన్‌లో నిర్వహించిన భారీ లాటరీలో 26590 నంబర్‌ టికెట్‌ గెలుపొందింది. లాటరీలో విజేతల ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎల్‌ గొర్డోగా పిలిచే ఈ లాటరీలో 26590 టికెట్‌ నంబర్‌ కలిగిన వారందరికీ రూ. 3 కోట్లు చొప్పున లభించనున్నాయి. విజేతలు దాదాపు రూ. 60 లక్షలు పన్నుల రూపంలో చెల్లించాలి. ఈ లాటరీ మొత్తం విలువ రూ. 17 వేల కోట్లు.  లాటరీ మొత్తంపరంగా చూస్తే ప్రపంచంలో ఇదే అత్యంత విలువైనది. ఈ లాటరీని 1763లో కింగ్‌ కార్లోస్‌–3 ప్రారంభించారు. ఇందులో వచ్చే డబ్బును కొందరు దానధర్మాలకు కూడా వినియోగిస్తారు.  ఏటా డిసెంబర్‌ 22వ తేదీన ఈ లాటరీ డ్రా తీస్తారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ