amp pages | Sakshi

భారత్‌ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా

Published on Tue, 04/07/2020 - 15:05

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 2900 మంది అమెరికన్లను స్వదేశానికి తీసుకువచ్చామని అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ పేర్కొన్నారు. 13 ప్రత్యే విమానాల ద్వారా వీరందరినీ తరలించినట్లు పేర్కొన్నారు. ‘‘ఈరోజు వరకు దక్షిణ-మధ్య ఆసియా దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఉజ్బెకిస్తాన్‌, టర్కిమినిస్తాన్‌ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా మా పౌరులను తీసుకువచ్చాం’’అని ఆమె పేర్కొన్నారు. (అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్‌)

ఇక భారత స్థానిక అధికారులతో అమెరికా ప్రభుత్వ వర్గాలు సమన్వయం చేసుకుంటూ అక్కడ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 1300 మందిని అమెరికాకు తీసుకువచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ గ్రామాలు, పట్టణాల్లో చిక్కుకుపోయిన అమెరికన్లను తరలించడంలో భారత్‌ సహాయం అందించిందని పేర్కొన్నారు. ఇదంతా బృంద స్ఫూర్తితోనే సాధ్యమైందన్నారు. ఇక మలేరియా యాంటీ డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతుల విషయమై తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై వెల్స్‌ పరోక్షంగా స్పందించారు. ‘‘మా పౌరులను వెనక్కి తీసుకురావడానికి దక్షిణాసియా దేశాలు చేసిన సహాయానికి కృతజ్ఞులం. మాకు సహకరించిన స్థానిక, ప్రాంతీయ, ఆరోగ్య అధికారులు, చట్ట సంస్థలు, పౌర విమానయాన శాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు.

అదే విధంగా అంటువ్యాధిని అరికట్టేందుకు భారత్‌- అమెరికా పరస్పరం సహకరించుకోవాలి. చాలా ఏళ్లుగా ఫార్మాసుటికల్‌ రంగంలో భారత్‌ అమెరికాకు భాగస్వామిగా ఉంది. అంతేకాదు జనరిక్‌ డ్రగ్స్‌ సరఫరా చేయడంలో భారత్‌ అగ్రగామిగా ఉంది. వాళ్లు అమెరికా మార్కెట్లోకి యాంటీ మలేరియా డ్రగ్‌ సరఫరా చేస్తారనే నమ్మకం ఉంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కరోనాను కట్టడి చేయడంలో సత్పలితాలు సాధిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల సరఫరా నిలిపివేసినట్లయితే భారత్‌పై వాణిజ్యపరంగా ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత్‌.. మహమ్మారితో తీవ్రంగా నష్టపోతున్న దేశాలకు అత్యవసరమైన మందులను ఎగుమతి చేస్తామని ప్రకటించింది.(అమెరికాలో మరింత తీవ్రం!)

ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్‌

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)