సింగిల్‌ షాట్‌లో ‘అశ్వద్ధామ’ పోరాటం

Published on Thu, 08/01/2019 - 10:31

ఈ జనరేషన్‌ దర్శకులు కథా కథనాల్లోనే కాదు మేకింగ్ పరంగా కూడా ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన డియర్‌ కామ్రేడ్ సినిమాలోని ఓ పాటను పూర్తిగా ఒకే షాట్లో తెరకెక్కించారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కొబ్బరిమట్ట సినిమాలో సంపూర్ణేష్‌ బాబు మూడు నిమిషాల డైలాగ్‌ను ఒకే టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఫలక్‌నుమా దాస్‌ సినిమాలో ఏకంగా 10 నిమిషాల క్లైమాక్స్‌ సీన్‌ను ఒకే షాట్‌లో చిత్రీకరించారు.

తాజాగా ఇలాంటి ప్రయోగానికే సిద్ధమవుతున్నాడు మరో యంగ్ హీరో నాగశౌర్య. తన సొంత బ్యానర్‌లో రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాల కీలక సమయంలో వచ్చే ఓ పోరాట సన్నివేశాన్ని ఒకే షాట్‌లో చిత్రీకరిస్తున్నారు. 3 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఈ షాట్ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుందంటున్నారు చిత్రయూనిట్‌. ఈ సన్నివేశానికి అన్బు అరివులు యాక్షన్ కొరియోగ్రాఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు అశ్వద్ధామ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ