ఎన్ని ఉన్నా ఏం లాభం?

Published on Fri, 04/17/2020 - 01:26

‘‘మనం హాయిగా బతకడానికి ఏవేవో కావాలనుకుంటాం. కానీ అంతిమంగా కావాల్సింది మానసిక ప్రశాంతతే. అది ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు’’ అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా చిన్నతనంలో అన్ని సౌకర్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాళ్లను ఆరాధనాభావంతో చూసేదాన్ని. కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మానసిక ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యమైనది అని అర్థం అయింది. ఎటువంటి ఒత్తిడిలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకపోతే ఏం లాభం?’’ అన్నారు కాజల్‌. అలాగే కరోనా వైరస్‌పై పోరాడేందుకు తన వంతు సహాయాన్ని అందించారు. ‘కరోనా క్రైసిస్‌ చారిటీ కోసం’ (సీసీసీ మనకోసం)కు 2 లక్షల రూపాయిల విరాళం ప్రకటించారు కాజల్‌.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ