'అంధ‌గాడు' చిత్రం దాసరికి అంకితం

Published on Wed, 05/31/2017 - 11:15

దాసరి మరణంతో ఇండస్ట్రీ ఒకసారిగా దిగ్బ్రాంతికి గురైంది. పాత తరం నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు... ఈ జనరేషన్ సినీ ప్రముఖులు కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న అంధగాడు సినిమాను దాసరి అంకితమిస్తున్నట్టుగా వెల్లడించారు ఆ చిత్ర నిర్మాతలు.

'ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్
ప్రపంచంలో ఏ ద‌ర్శకుడు తీయ‌లేన‌ని విభిన్నమైన చిత్రాల‌ను తెర‌కెక్కించి 151 చిత్రాల‌కు ద‌ర్శకుడిగా త‌న పేరును సువ‌ర్ణాక్షరాల‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో రాసుకున్న ద‌ర్శకర‌త్న డా.దాస‌రినారాయ‌ణరావుగారు ప‌ర‌మ‌ప‌దించ‌డం మ‌మ్మల్ని ఎంతో బాధ‌కు గురి చేసింది. ఇండ‌స్ట్రీకి సంబంధించి ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేనున్నా అంటూ ముందుకు వ‌చ్చి నిల‌బ‌డి న్యాయం చేకూర్చే గొప్ప వ్యక్తి దాస‌రిగారు. మంచి చిత్రాల‌కు ఆద‌ర‌ణ ఉండాల‌ని, చిన్న నిర్మాత‌లు బావుండాల‌ని కోరుకునే శ్రేయోభిలాషి ఆయ‌న‌. మా ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌కు వెన్నంటి నిలిచారు.

ఎంట‌ర్‌టైన్మెంట్‌ను ఇష్టప‌డే దాస‌రిగారు మా సంస్థలో వ‌చ్చిన ప్రతి సినిమాను ఆయ‌న వీక్షించి యూనిట్‌కు త‌న ఆశీస్సుల‌ను అంద‌చేసేవారు. . భౌతికంగా దాస‌రిగారు మ‌న‌ల్ని విడిచి పెట్టినా, ఆయ‌న సినిమాల రూపంలో ఎప్పటికీ మ‌న మ‌ధ్యనే ఉంటారు. మా సంస్థకు దాస‌రిగారు అందించిన స‌హాయ స‌హ‌కారాల‌ను మ‌ర‌చిపోలేం. మా బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతున్న 'అంధ‌గాడు' చిత్రాన్ని దాస‌రిగారికి అంకిత‌మిస్తున్నాం. ఆయ‌న ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్న'ట్టుగా తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ