‘టాయిలెట్ హీరో’గా మారిన అక్షయ్‌

Published on Sat, 06/02/2018 - 13:02

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నాయి. ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ మూవీ సక్సెస్‌ తరువాత చైనా మార్కెట్‌పై కన్నేసింది బాలీవుడ్‌. సినిమాలో కంటెంట్‌ ఉంటే చైనాలో కూడా రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నాయి మన సినిమాలు. సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, ఖాన​భజరంగీ భాయిజాన్‌, ఇర్ఫాన్‌ఖాన్‌ ‘బ్లాక్‌మెయిల్‌’ అక్కడ కూడా సక్సెస్‌ సాధించాయి. తాజాగా అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘టాయిలెట్‌ ఏక్‌ప్రేమ్‌ కథా’ కూడా చైనా రిలీజ్‌కు సిద్ధమైంది.

గతేడాది విడుదలైన ఈ మూవీ భారత్‌లో విమర్శకుల ప్రశంసలతో పాటు, కలెక్షన్లు కూడా బాగానే సాధించింది. ఈ మూవీని ఇప్పుడు చైనాలో రిలీజ్‌ చేయనున్నారు. టాయిలెట్‌ హీరో అనే టైటిల్‌తో జూన్‌ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మరి ఈ సినిమా అక్కడ కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో అక్షయ్‌కు జోడీగా భూమి ఫెడ్నేకర్‌ నటించిన సంగతి తెలిసిందే. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ