ఫెస్టివల్‌ క్యాన్సిల్‌

Published on Sat, 03/21/2020 - 05:11

ప్రఖ్యాత ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కాన్స్‌ వాయిదా పడింది. ఈ ఏడాది కాన్స్‌ చిత్రోత్సవాలు కరోనా కారణంగా జరుగుతాయా? లేదా? అనుకుంటున్న సందర్భంలో ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహించబోవడం లేదని కాన్స్‌ నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి ఏడాది ఫ్రాన్స్‌లో కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. కాన్స్‌లో గెలుపొందిన సినిమాల నుంచే ఆస్కార్‌ రేసు కూడా మొదలవుతోంది. ఈ ఏడాది మే 12 నుంచి 23 వరకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ముందు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో జరగడంలేదని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాన్స్‌ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. జూన్‌ చివర్లోనో లేదా జూలై ప్రారంభంలోనో కాన్స్‌ ఫెస్టివల్‌ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అని చిత్రోత్సవాల నిర్వాహకులు పేర్కొన్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ