దీపిక ఫస్ట్‌.. ప్రియాంక సెకండ్‌

Published on Sat, 12/08/2018 - 01:16

బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకోన్‌ తొలి స్థానంలో నిలవగా, ప్రియాంకా చోప్రా ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎందులో వీరిద్దరూ ఫస్ట్, సెకండ్‌ స్థానాల్లో నిలిచారు? అనేగా మీ డౌట్‌. ‘ఈస్టర్న్‌ ఐ వీక్లీ’ అనే మ్యాగజీన్‌ ప్రతి ఏడాది ‘ఆసియా టాప్‌ 50 సెక్సియస్ట్‌ విమెన్‌’ జాబితాను విడుదల చేస్తుంటుంది. తాజాగా 2018 జాబితాను విడుదల చేయగా దీపికా పదుకోన్‌ తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో ప్రియాంక ఉన్నారు.

అటు సినిమాలు చేస్తూనే ఇటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నందున దీపిక టాప్‌లో నిలిచారని అభిమానులు సంబరపడుతున్నారు. ఇటీవలే దీపికా–రణ్‌వీర్‌సింగ్, ప్రియాంక–నిక్‌ జోనస్‌ల వివాహాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దీపిక, ప్రియాంక తర్వాతి టాప్‌ టెన్‌ లిస్టులో టీవీ నటి నియాశర్మ, పాకిస్తానీ నటి మహీరా ఖాన్, బాలీవుడ్‌ నటీమణులు శివాగ్ని జోషి, ఆలియా భట్, సోనమ్‌ కపూర్, హీనా ఖాన్, కత్రినా కైఫ్, నీతి టేలర్‌ నిలిచారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ