amp pages | Sakshi

అవును...కాపీ కొట్టా!

Published on Wed, 07/09/2014 - 00:40

 సంచలనాలకు పర్యాయపదం రామ్‌గోపాల్‌వర్మ. అనిపించింది అనేయడం, నచ్చినట్లు సినిమా తీసేయడం వర్మ శైలి. ఈ క్రమంలోనే అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. అప్పుడప్పుడు వర్మ తళుక్కున మెరుస్తుంటారు. ఆ మెరుపుకు తర్వాత తరానికి వెలుగునిచ్చే స్థాయిలో ఉంటుంది. దటీజ్ వర్మ. ఆయన దర్శకత్వం వహించిన ‘ఐస్‌క్రీమ్’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
 
 మళ్లీ హారర్ బాట పట్టారేంటి? భయపెట్టడం మానరా?

 ఒకే జానర్‌లో వెళ్లడం నాకిష్టం ఉండదు. అయితే... అప్పుడప్పుడు కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అది హారర్, మాఫియా, వేరే ఏ జానర్ అయినా కావచ్చు. దాన్ని వెంటనే ఒక రూపానికి తెచ్చేస్తా.

 ప్రపంచవ్యాప్తంగా లెక్కకు మించిన హారర్ సినిమాలొచ్చాయి. మీరూ తీశారు. మరి ఇందులో కొత్తదనం?
 ఇదేం కొత్త కథ కాదు. అయితే... తీసిన తీరు కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులను ఒక రకమైన ఉత్కంఠకు గురి చేస్తుంది. నేను చాలా నమ్మకం పెట్టుకొని చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేస్తారో లేదో తెలీదు కానీ, నా వరకూ ప్రేమించి ఈ సినిమా చేశాను. ఫ్లో కామ్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఇప్పటివరకూ కెమెరాను బట్టి మనిషి నటించాడు. కానీ... కెమెరాతో సంబంధం లేకుండా ఆర్టిస్టులు నటించడం ఈ సిస్టమ్ స్పెషాలిటీ. ఇదొక వినూత్న ప్రయత్నం. ఈ విషయంలో నేను గర్వంగా ఫీలవుతున్నా.
 
 హారర్ సినిమాకు ‘ఐస్‌క్రీమ్’ పేరేంటి?
 హీరోయిన్‌కి ఐస్‌క్రీమ్ తినడం ఇష్టం. దాని కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ శాతం ఒకే ఇంట్లో నవదీప్, తేజస్వి నేపథ్యంలో కథ నడుస్తుంది.
 
 తేజస్వితో నగ్నంగా నటింపజేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది. పబ్లిసిటీ కోసమా?
 కథ కోసం. ఆ కథకు అది చాలా అవసరం. అది నమ్మే అందరూ చేశారు. ఆ అమ్మాయి అలా చేసేటప్పుడు మేం ఎవరమూ లేవు. కానీ ఆ అమ్మాయి న్యూడ్‌గా మారిందని మాత్రం చూసే ఆడియన్స్‌కి తెలిసిపోతుంది.
 
 అసలు తేజస్విని ఎలా సెలక్ట్ చేశారు?
 నేను ఆ అమ్మాయిని తొలిసారి ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌లో చూశాను. ‘హార్ట్ ఎటాక్’ యూనిట్‌తో కలిసి తను వెళ్తోంది. తనతో పాటు హీరోయిన్ అదాశర్మ కూడా ఉంది. కానీ... ఎందుకో నా దృష్టి ఆమెపై పడలేదు. ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ తేజస్వే అనుకున్నాను. తను కాదని తర్వాత చెప్పాడు పూరీ. కానీ తేజస్వి నచ్చడంతో విష్ణు హీరోగా నేను రూపొందిస్తున్న చిత్రంలో ఓ చిన్న పాత్ర చేయించాను. బాగా చేయడంతో ‘ఐస్‌క్రీమ్’ చిత్రానికి తీసుకున్నాను. అనుకున్న దానికంటే గొప్పగా నటించింది.
 
 నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు సినిమా మీరు చేయడం చర్చనీయాంశమైంది.
 మీకు తెలీదనుకుంటా. ‘శివ’ తర్వాత తెలుగు చిత్ర సీమలోని స్టార్ ప్రొడ్యూసర్లందరూ నా దగ్గరకొచ్చి భారీ మొత్తంలో అడ్వాన్సులు ఇవ్వడానికి వెంటబడ్డారు. కానీ... నేను కేఎల్ నారాయణ గారికి ‘క్షణక్షణం’ చేశాను. మొదట్నుంచీ నా మెంటాలిటీ అంతే. ‘పెద్ద... చిన్నా’ అనే భేదాలు ఉండవు. రామసత్యనారాయణ మంచి నిర్మాత. ఒక టెక్నీషియన్‌లా పనిచేశాడు.
 
 ఒక్కోసారి గొప్పగా తీస్తారు. ఒక్కోసారి తీసిన సీన్లే తీసి విమర్శలు ఎదుర్కొంటారు. ఎందుకలా?
 నేను తీసిన సీన్లే తీసిన ఒక్క సినిమా చెప్పండి?


 ‘రౌడీ’... ఆ సినిమాలో ‘అంతం’లోని ఓ సీన్‌ను యథాతథంగా కాపీ కొట్టేశారు.
  ఈ విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నా. ‘అంతం’ ఇంకా జనాలకు గుర్తుంటుందని అనుకోలేదు. ఎందుకంటే... అదొక ఫ్లాప్ సినిమా. ఆ రోజుల్లో ఆ సినిమా తీసినందుకు నాగార్జున ఫ్యాన్సే నన్ను తిట్టారు. కానీ ఆ సినిమా నాకు ఇష్టం. అందుకే ఈ జనరేషన్‌కి ఆ సీన్‌ని పరిచయం చేయాలనుకున్నాను. కానీ... ఒక్కటి మాత్రం నిజం. నేను కష్టపడే విషయంలో తేడా ఉండదు. కానీ.. చుట్టూ ఉన్నవారి ప్రభావం కూడా నాపై ఉంటుంది. నేను ఏం తీసినా బావుంది అనడం వల్ల వస్తున్న సమస్యలివన్నీ. అలాంటి వారి వల్ల కొన్ని ఫ్లాపుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే... ఇక నుంచి నేను తీసిన సినిమాలను నాకు సంబంధం లేని ఓ పది మందికి చూపించిన తర్వాతే విడుదల చేయాలనుకుంటున్నా.
 
 తెలుగువారు గర్వించదగ్గ దర్శకులు మీరు. కానీ... అనవసరపు వ్యవహారాల్లో వేలు పెట్టడం, వివాదాస్పదమైన అంశాలను ట్వీట్ చేయడం వల్ల మిమ్మల్ని ప్రేమించినవారే ద్వేషిస్తున్నారు... తెలుసా?

 ఈ విషయంలో నన్నెవరూ కొశ్చన్ చేయలేదే.
 
 మిమ్మల్ని డెరైక్ట్‌గా ఎందుకు అంటారు. మా ముందు అంటారు.
 ఎవరన్నారు?


 ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మీరు ట్వీట్ చేశారు. ఈ కారణంగా తెలంగాణ
  వారి మనోభావాలు దెబ్బతినవా?

 నేను ఆయన్ను ఏమీ అనలేదే? ‘కేసీఆర్ అందగాడు’ అన్నాను. అందులో తప్పేం ఉంది.
 
 అందులో కూడా వ్యంగ్యం ఉందిగా?
 ప్రతి నాయకుడికీ చరిష్మా ఉంటుంది. దాంట్లోనే అందం ఉంటుంది. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌గారిలో ఆ చరిష్మా ఇంకాస్త ఎక్కువైంది. అదే చెప్పాను. అంతకు మించి ఒక్కమాట కూడా అనలేదే. అయినా... ట్విట్టర్ అనేది మన మనోభావాలను వ్యక్తం చేయడానికి ఓ సాధనం. దాన్ని సీరియస్‌గా తీసుకుంటే నేనేం చేసేది.
 - బుర్రా నరసింహ

 

Videos

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)