కోలీవుడ్ గీతాంజలిలో జీవి

Published on Sat, 05/28/2016 - 14:10

ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు.

ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది.

నాన్ పేయి పేసురేన్ అనే తమిళ  హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ