మళ్లీ కెమిస్ట్రీ పండుతుందా?

Published on Thu, 07/03/2014 - 00:17

హృతిక్ రోషన్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఓ పక్క భార్యతో విడాకులు, మరోపక్క స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా హృతిక్  కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 2013 నవంబర్‌లో ‘క్రిష్ 3’ వచ్చింది. ఆ తర్వాత ఆయన కమిట్ అయిన సినిమా ‘బాంగ్ బాంగ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారం విడులైంది. ఈ ప్రచార చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తర్వాత హృతిక్, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఇది.

ఆ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ ప్రచార చిత్రంలో కూడా మంచి కెమిస్ట్రీ కనిపిస్తోందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకి రావడానికి కారణంగా నిలిచేవాటిలో ప్రచార చిత్రాలకు ప్రధాన స్థానమే ఉంటుంది. ఆ పరంగా చూసుకుంటే ఈ ప్రచార చిత్రం వందకు వంద మార్కులు కొట్టేసింది. ఫలితంగా చిత్రంపై భారీ అంచనాలు ఆరంభమయ్యాయి. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. అంచనాలను ఏ మేరకు నిజం చేస్తుందో వేచి చూడాల్సిందే!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ