జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
మహేశ్‌బాబు కూతురి ఫొటోలకు అంతా 'ఫిదా'
Published on Wed, 08/23/2017 - 21:21
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలు ఏం చేసినా హాట్ టాపిక్‌గా మారుతోంది. తన కూతురు సితారను డ్యాన్స్ ప్రాక్టీస్‌కు తయారుచేసిన అనంతరం మరాఠీ బొమ్మలా అందంగా తయారైందని మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ట్వీట్ చేశారు.
'బెంగాలీ, మహారాష్ట్ర ముద్దుగుమ్మలు హైదరాబాద్‌లో ఉన్నారు. లవ్ అండ్ మోర్ లవ్ అని' ఓ ట్వీట్ చేస్తూ సితార ఫొటోను పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. సంప్రదాయ దుస్తుల్లో సితార నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సితార శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటన్న విషయాన్ని నమ్రత తెలిపిన సంగతి విదితమే. హైదరాబాద్ డ్యాన్స్ అకాడమీ 'నాట్య వేద'లో సితార డ్యాన్స్ నేర్చుకుంటుందని, శిక్షణ ఇస్తున్న గురువు అరుణ భిక్షు గారికి ధన్యవాదాలు చెబుతూ నమ్రత మరో ట్వీట్ చేశారు. నమ్రత పోస్ట్ చేసిన సితార ఫొటోలు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. సితార శాస్త్రీయనృత్యం బాగా నేర్చుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
It's raining bengali and maharastrian beauties in Hyderabad ❤️❤️❤️❤️😘😘😘😘 love and more love. pic.twitter.com/BIcMnHFC6I
— Namrata shirodkar (@urstrulynamrata) 22 August 2017
Tags