సోలో స్టార్‌

Published on Tue, 07/24/2018 - 01:49

ఒక్కే ఒక్క పాత్రతో ఒకేసారి నాలుగు భాషలలో తెరకెక్కించారు. పైగా ఫస్ట్‌ టైమ్‌ సరౌండ్‌ సింక్‌ సౌండ్‌తో చిత్రీకరణ. సినిమా పేరు ‘ప్రాణ :’.  ఇన్ని డిఫరెంట్‌ ఎలిమెంట్స్‌ ఉన్న డిఫరెంట్‌ సినిమాలో నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేశారు. వీకే ప్రకాశ్‌ దర్శకత్వంలో, పీసీ శ్రీరామ్‌ కెమెరామేన్‌గా రూపొందిన చిత్రం ‘ప్రాణ:’. సురేశ్‌ రాజ్, ప్రవీణ్‌ ఎస్‌. కుమార్, అనితా రాజ్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను హీరో నాని రిలీజ్‌ చేశారు.

‘‘నిత్యామీనన్‌కు, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. నేను కూడా ఈ సినిమాలో భాగమే కానీ చిన్న భాగం’’ అన్నారు నాని. నిత్యా మీనన్‌ మాట్లాడుతూ – ‘‘మీ సపోర్ట్‌కి, మీ ప్రెజెన్స్‌కి  చాలా థ్యాంక్స్‌ నాని. మీ ఇన్వాల్వ్‌మెంట్‌ ఈ సినిమాకు ప్లస్‌ అవుతుంది. అందరికీ ఈ సినిమా ఎప్పుడు చూపిస్తానా అని ఆత్రుతగా ఉంది’’ అని పేర్కొన్నారు. మరి నాని ఇన్‌వాల్వ్‌మెంట్‌ అంటే ఏదైనా సీన్‌లో గెస్ట్‌గా కనిపిస్తారా? లేకపోతే వినిపిస్తారా? అంటే సినిమా రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ