అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చేలా టైటిల్‌ పెట్టాం

Published on Tue, 04/14/2020 - 03:13

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను పది భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సరిపోయే టైటిల్‌ను ప్రేక్షకులే నిర్ణయించాలని రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్రేక్షకులను కోరిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఈ టైటిల్‌ గురించి, ఈ ప్రాజెక్ట్‌ గురించి రాజమౌళి ఓ ఇంటర్య్వూలో ఏం చెప్పారంటే....‘‘ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఒక వర్కింగ్‌ టైటిల్‌ అనే భావించాం. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో ఆ అక్షరాలు వచ్చేట్లే టైటిల్‌ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎన్టీఆర్‌ (స్టూడెంట్‌ నెం 1, సింహాద్రి, యమదొంగ), రామ్‌చరణ్‌ (మగధీర).. ఇలా ఈ ఇద్దరితో నేను సూపర్‌ హిట్‌ సినిమాలు చేశాను. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు అది నాకు బాగా అడ్వాంటేజ్‌ అయ్యింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఐడియాను వారికి చెప్పినప్పుడు ‘ఓకే’ చెప్పడానికి ఒక్క నిమిషం కూడా తీసుకోలేదు’’ అని పేర్కొన్నారు రాజమౌళి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ