యంగ్ హీరోతో శృతి!

Published on Wed, 06/20/2018 - 10:03

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా... కెరీర్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన బ్యూటీ శృతి హాసన్‌. సక్సెస్‌ కోసం చాలా కాలం ఎదురుచూసిన ఈ భామ హిట్ వచ్చిన తరువాత కూడా ఆ ఇమేజ్‌ను కాపాడుకోలేకపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చిన హిట్స్‌ దక్కకపోవటంతో కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో నెమ్మెదిగా సినిమాలు తగ్గించేశారు. గత ఏడాది కాలంగా శృతి హాసన్‌ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

అయితే ఇప్పుడు ఈ భామ వరుసగా తెలుగు సినిమాలకు కమిట్‌ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్‌ ఆంటోని సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తాజాగా నాని కొత్త సినిమాలో కూడా శృతినే హీరోయిన్‌ గానటించనుందన్న ప్రచారం జరుగుతోంది. నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

జెర్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటు మహేష్ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నారు శృతి హాసన్‌.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ