మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
త్రిష పాట వింటారా..
Published on Mon, 04/11/2016 - 19:14
అడపాదడపా సినీ హీరోలు తమ గొంతు సవరించుకుని పాటలు పాడుతుంటారు. ఈ మధ్య కాలంలో అయితే అలాంటి పాటలు చాలానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో ఆ పాటల వీడియోలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ల వంతు. తాజాగా నాజూకు అందాల సుందరి త్రిష 'నాయకి' సినిమా కోసం తొలిసారి తెలుగులో ఓ పాట పాడింది. ఎప్పుడెప్పుడు ఆమె గాత్రాన్ని విందామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం యూ ట్యూబ్ లో ఆ పాట అలరించనుంది. 'నాయకి' కోసం స్వయంగా త్రిష పాడిన పాటను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్... యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. రఘుకుంచె, సాయి కార్తీక్ లు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
పాటను లాంచ్ చేసినందుకు మురిసిపోతూ 'థాంక్యూ మై ఫ్రెండ్.. బిగ్ బిగ్ బిగ్ హగ్' అంటూ పూరీని ఉద్దేశించి ట్వీట్ చేసింది మన నాయకి. త్రిష గొంతు విన్న పూరీ 'లవ్ యువర్ వాయిస్' అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరి మీరూ వినేయండి..
https://t.co/aEXHC1Effd N telugu it is.....❤️ #Nayaki
— Trisha Krishnan (@trishtrashers) 11 April 2016
Thank u so much my friend @purijagan for launching my song..Big big biggg hug. pic.twitter.com/ZRisJp5g1d
— Trisha Krishnan (@trishtrashers) 11 April 2016
#
Tags