amp pages | Sakshi

15 ఏళ్లు దాటితే పక్కనబెట్టాల్సిందే..

Published on Thu, 08/25/2016 - 22:28

కాలుష్య సమస్యతోపాటు ప్రమాదాలకు కారణమువుతున్న పాత వాహనాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని, ఇది అమలైతే 15 ఏళ్ల నాటి 11.5 లక్షల ట్రక్కులు, బస్సులు కనుమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ : అనేక సమస్యలకు కారణమవుతున్న 15 ఏళ్లకు పైబడిన వాహనాలన్నింటినీ దశల వారీగా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించింది. ఈ విధానం అమలైతే రోడ్లపై చక్కర్లు కొడుతున్న 15 ఏళ్ల నాటి 11.5 లక్షల ట్రక్కులు, బస్సులు కనుమరుగవుతాయి. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై రూ.నాలుగు వేల కోట్ల భారం పడనుంది.  కాలుష్యభరితమైన పాత వాహనాల తొలగింపుపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, రవాణా మంత్రి నితిన్‌ గడ్కారీ చర్చలు జరిపారు.  

పాత వాహనాల తొలగింపునకు ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటి దశలో పాత ట్రక్కులు, భారీ వాహనాలకు, రెండో దశలో 15 ఏళ్ల కిందటి 60 లక్షల నాలుగు చక్రాల వాహనాలకు స్వస్తి పలుకనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాలుష్య నిబంధనలకు అనుగుణంగా లేని పాత వాహనాలను  తప్పనిసరిగా తొలగించాలనే నిబంధనను తీసుకురావాలని ఆర్థిక మంత్రి భావిస్తున్నట్టు నితిన్‌ గడ్కారీ తెలిపారు. ‘పాత వాటి స్థానంలో కొత్తవి కొనేవారికి నేరుగా నగదు ప్రయోజనాలు కల్పిస్తాం. అయితే ఎక్సైజ్‌ డ్యూటీ మాత్రం చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు లేకపోవడం వల్ల కొత్త వాహనాల అమ్మకంతో ప్రభుత్వానికి సుమారు రూ.19 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది.  చమురు దిగుమతులు కూడా తగ్గించుకుని, ఏటా రూ.7,700 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని మా మంత్రిత్వశాఖ నిర్ణయించింది’ అని మంత్రి గడ్కారీ వివరించారు.

Videos

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)