ఆ కేసులో పంజాబ్‌ సీఎంకు ఊరట..

Published on Fri, 07/27/2018 - 18:59

చండీగఢ్‌ : పదేళ్ల కిందట ప్రైవేట్‌ డెవలపర్‌కు భూమి బదలాయింపు కేసులో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ సహా 17 మందికి విముక్తి లభించింది. నిందితుల్లో పంజాబ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, సహా ఇద్దరు మాజీ మంత్రులు మరణించారు. అమృత్‌సర్‌ ట్రస్ట్‌కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రైవేట్‌ డెవలపర్‌కు అభివృద్ధి పరిచే నిమిత్తం బదలాయించడంలో 18 మంది నిందితులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని విజిలెన్స్‌ బ్యూరో (వీబీ) నివేదిక ఆధారంగా కేసును మూసివేస్తున్నట్టు మొహాలీ ప్రత్యేక న్యాయమూర్తి జస్వీందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

పంజాబ్‌ అసెంబ్లీ సూచనతో 2008లో విజిలెన్స్‌ బ్యూరో వీరిపై కేసు నమోదు చేసింది. న్యాయస్ధానానికి హాజరైన అమరీందర్‌ సింగ్‌ ఇతర నిందితులు తీర్పును స్వాగతించారు. చివరికి న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు.

రాజకీయ కక్షసాధింపుతోనే తమపై విజిలెన్స్‌ బ్యూరోను ప్రేరేపించి కేసులో ఇరికించారని అప్పటి అకాలీదళ్‌-బీజేపీ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గిన విజిలెన్స్‌ బ్యూరో అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ