నామినేషన్‌ సమర్పించిన కేంద్ర మంత్రులు

Published on Mon, 03/12/2018 - 13:20

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  అరుణ్‌ జైట్లీ, కేంద్ర న్యాయ, సమాచారశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అరుణ్‌జైట్లీ  ఉత్తర ప్రదేశ్ నుంచి‌, రవిశంకర్‌ ప్రసాద్‌ తన సొంత రాష్ట్రం బిహార్‌ నుంబి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.  రెండు రోజుల క్రితమే పార్టీ అభ్యర్థుల పేర్లును ప్రకటించడంతో మంత్రులు ఇవాళ నామినేషన్లు వేశారు. కాగా  మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నామినేషన్‌ వేయడానికి బయలుదేరే ముందు తల్లి ఆశీర్వాదాలు అందుకుని ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌ లో షేర్‌ చేశారు.

గాంధీనగర్‌: గుజరాత్‌ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి డాక్టర్‌ యామీ యాజ్‌నిక్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. తన నామినేషన్‌కు అధిష్టానం నుంచి రెండు రోజుల క్రితమే గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో నామినేషన్‌ దాఖలు చేశారు.

మధ్యప్రదేశ్‌: కేంద్ర పెట్రోలియం, సహజ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రథాన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి  సోమవారం నాడు భోపాల్‌లో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. మరో కొన్ని రోజుల్లో తన రాజ్యసభ పదవికాలం ముగియనుండడంతో మంత్రి మరోసారి రాజ్యసభకు ఎన్నికకానున్నారు. కాగా రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మేజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక నల్లేరు మీద నడకే.

ముంబాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా మహారాష్ట్ర సీనియర్‌ జర్నలిస్ట్‌ కుమార్ ఖేత్‌కర్‌ రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన కుమార్‌కు రాహుల్‌ గాంధీ అవకాశం కల్పించారు. ఖేత్‌కర్‌ మొదటి సారి చట్ట సభలో అడుగుపెట్టనున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ