జాతీయవాదంపై కాంగ్రెస్‌ నేతలకు క్లాస్‌

Published on Mon, 10/07/2019 - 16:02

సాక్షి, న్యూఢిల్లీ : జాతీయవాదాన్ని పెద్ద ఎత్తున ముందుకు తెచ్చిన పాలక బీజేపీకి దీటుగా కాంగ్రెస్‌ తమ పార్టీ నేతలకు ఈ అంశంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. జాతీయవాదంపై పార్టీ నేతలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ స్ధాయిలో శిక్షణా శిబిరాలను నిర్వహించాలని కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం భావిస్తోంది. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన పార్టీ రాష్ట్ర శాఖల చీఫ్‌లు, సీఎల్పీ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి నడిపించి, దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయవాద మూలాలపై ఈ శిక్షణలో పార్టీ నేతలకు పూర్తి అవగాహన కల్పిస్తారు. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ వేరు పడేలా చేయడంలో సఫలీకృతమవడం ద్వారా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన తీరుపై కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో హైలైట్‌ చేయనున్నారు. వివిధ వర్గాలకు తిరిగి చేరువ కావడం ద్వారా పార్టీ పునాదులను పటిష్టపరచుకోవడంపై కూడా అగ్రనేతలు ఈ శిక్షణా కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ