ఇందిరమ్మకు ప్రముఖుల నివాళులు

Published on Wed, 10/31/2018 - 11:22

సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరులు శక్తిస్థల్‌ కు వచ్చి నివాళులర్పించారు. దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

‘ఇందిరా గాంధీ మాకు శాశ్వత ప్రేమను ఇచ్చారు. ఆమె ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. తన జీవితాంతం ప్రజల బాగు కోసం పాటు పడ్డారు, ఆమెను ఆనందంతో స్మరించుకుంటున్నాం’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ట్వీటర్‌ ద్వారా ఇందిరా గాంధీకి నివాళులర్పించారు. దేశం కోసం ఆమె చేసిన కృషిని విషయాన్ని మరిచిపోలేమని ఆయన అన్నారు.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దంపతులకు 1917, నవంబర్‌ 19న ఇందిరా గాంధీ జన్మించారు. 1966లో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్ర్తి ఆకస్మిక మరణంతో ప్రధాని పదవిని చేపట్టి 1977 వరకు ఆ పదవిలో ఉన్నారు. మళ్లీ 1980లో మరోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. 1984 అక్టోబర్‌ 31న అంగరక్షకులు చేతిలో హత్యగావించబడ్డారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ