రెండుసార్లు కరోనా నెగిటివ్​.. డాక్టర్‌ మృతి

Published on Sat, 07/04/2020 - 11:36

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్​ టెస్టుల్లో రెండుసార్లు నెగటివ్​ వచ్చిన ఢిల్లీకి చెందిన జూనియర్​ డాక్టర్ ఒకరు​ గురువారం చనిపోయారు. ప్రాణాలు కోల్పోయేముందు ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోలేకపోవడం తదితర లక్షణాలు డాక్టర్‌ అభిషేక్ భయానాలో కనిపించాయని అతని సోదరుడు అమన్​ వెల్లడించారు. ‘నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఈ లక్షణాలన్నీ కరోనావే.. నేను కచ్చితంగా కోవిడ్​ పాజిటివ్​’ అని అభిషేక్ తన చివరి మాటల్లో చెప్పినట్లు పేర్కొన్నారు. (కరోనాపై అలర్ట్‌ చేసింది చైనా కాదు: డబ్ల్యూహెచ్ఓ)

మౌలానా ఆజాద్​ ఇనిస్టిట్యూట్​ ఫర్ డెంటల్​ సైన్సెస్(మెయిడ్స్​)​లోని ఓరల్​ సర్జీరీ డిపార్టుమెంట్​లో అభిషేక్ పని చేస్తున్నారు. ఎయిమ్స్​ ఎండీఎస్​ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు తెచ్చుకున్న ఆయన జూన్​ నెలలో హరియాణాలోని రోహ్​తక్​కు వెళ్లి వచ్చారు. అభిషేక్​ అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం నిర్వహించారు. (గ్రేటర్‌లో కరోనా విజృంభణ.. జనం హైరానా)

‘అభిషేక్ మంచి డాక్టర్​. కరోనా లక్షణాలు ఉన్నా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్​ రాలేదు. ఆయన హార్ట్ ఎటాక్​తో చనిపోయారు’ అని మెయిడ్స్​కు చెందిన ఓ సీనియర్​ డాక్టర్ వెల్లడించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ