11 లక్షల మంది కూలీలకు ఉపాధి

Published on Fri, 05/29/2020 - 16:51

లక్నో : కరోనా మహమ్మారితో రాష్ట్రానికి తిరిగివచ్చిన వారిలో 11 లక్షల మంది వలస కూలీలకు ఉపాధి కల్పించేలా పరిశ్రమ సంస్థలతో యూపీ ప్రభుత్వం శుక్రవారం పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకుంది. ఫిక్కీ, ఐఐఏలు చెరో మూడు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు రాగా, నరెడ్కో 2.5 లక్షలు, లఘు ఉద్యోగ్‌ భారతి 5 లక్షల ఉద్యోగాలను సమకూర్చనున్నాయని యూపీ ఎంఎస్‌ఎంఈ మంత్రి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సమక్షంలో వలస కూలీల ఉపాథికి సంబంధించి ఆయా సంస్ధలతో ఎంఓయూలపై సంతకాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. వలస కూలీలకు ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వ హామీని నెరవేర్చామని చెప్పారు. యూపీ కార్మికులను కొన్ని రాష్ట్రాలు గుదిబండలుగా భావిస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వారిని ఆస్తులుగా మలిచారని చెప్పుకొచ్చారు. వలస కూలీల కోసం తమ శాఖ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసిందని సింగ్‌ పేర్కొన్నారు.

చదవండి : షెల్టర్‌ హోంలో వలస కూలీ మృతి

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ