బెంగాల్‌లో బీజేపీ దూకుడు

Published on Sat, 08/19/2017 - 16:02

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ల స్థానంలో బీజేపీ కీలక శక్తిగా అవతరించనుందా అనే చర్చకు తెర లేచింది. ఇటీవల వెల్లడైన ఏడు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇదే అంశాన్ని ముందుకుతెచ్చాయి. 2012లో ధూప్‌గురి మున్సిపాల్టీలో కేవలం 8.6 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ తాజాగా వెల్లడైన స్దానిక ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 41.7 శాతం ఓట్లు సాధించింది. దళితులు అధికంగా ఉన్న ధూప్‌గిరిలో బీజేపీకి ఈ స్ధాయిలో ఓట్లు పోలవడం విశ్లేషకులను సైతం నివ్వెరపరిచింది. హల్దియా, ధూప్‌గురి, పన్సుకురా మున్సిపాల్టీల్లో వామపక్షాలు, కాంగ్రెస్‌లు కలిసి సాధించిన ఓట్ల కన్నా బీజేపీ ఓటింగ్‌ శాతం అధికం కావడం గమనార్హం.

దుర్గాపూర్‌, నల్హాటి మున్సిపాల్టీల్లో బీజేపీ రెండో స్ధానంలో నిలవగా, కూపర్స్‌ క్యాంప్‌లో వామపక్షాలకు దీటుగా ఓట్లు సాధించింది. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లను ఆకట్టుకునే నేత, పటిష్టమైన క్యాడర్‌ లేకున్నా 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రజల్లో పట్టు పెంచుకుంటున్నది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ