‘ఖలిస్తాన్’ నేత హర్మిందర్ అరెస్టు

Published on Tue, 11/29/2016 - 01:08

నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి..
 
 న్యూఢిల్లీ: పంజాబ్‌లోని నభా జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూను పోలీసులు కొన్ని గంటల్లోనే చాకచక్యంగా నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. మలేసియా, లేదా జర్మనీకి పారిపోయేందుకు యత్నిస్తుండగా ఢిల్లీ, పంజాబ్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. జైలునుంచి తప్పించుకున్న మిగిలిన ఐదుగురు ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నాక హర్మిందర్ కదలికలపై నిఘా పెట్టిన పంజాబ్ పోలీసులు.. ఢిల్లీ వైపుగా వెళ్తున్నట్లు గుర్తించారు.

ఢిల్లీ పోలీసుల సహకారంతో జారుుంట్ ఆపరేషన్ చేపట్టి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్ పార్కింగ్ వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పిస్టల్, ఆరు కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ అర్వింద్ దీప్ చెప్పారు. పన్వల్ వరకూ హర్మిందర్ టికెట్ కొన్నాడని, అక్కడి నుంచి ముంబై లేదా గోవాకు వెళ్లి అనంతరం విదేశాలకు పారిపోవాలని నిర్ణరుుంచుకున్నట్లు తేలిందన్నారు.హర్మిందర్‌ను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 7 రోజుల కస్టడీకి అప్పగించింది. 6 నెలలుగా జైలు నుంచి తప్పించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నామని, గురుప్రీత్ సింగ్, హర్జిందర్ సింగ్‌లు సూత్రధారులని హర్మిందర్ విచారణలో చెప్పాడు. మరో సూత్రధారి పర్మిందర్‌ను ఆదివారం యూపీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. పరారీలో ఉన్న ఉగ్రవాది కశ్మీరాసింగ్, మిగతా నలుగురు గ్యాంగ్‌స్టర్లు కర్నాల్, పానిపట్ పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పర్మిందర్ విచారణలో చెప్పాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ